మెగాడాటర్ నీహారిక (Niharika Konidela) గురించి అందరికీ తెలిసిందే. నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా తనను తాను నిరూపించుకోవాలనుకుంది. మొదట యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత హీరోయిన్ గా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో ఆమె నటించిన 'ఒక మనసు', 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇవేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో అవకాశాలు కూడా రాలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో చిన్న పాత్రలో మెరిసింది నీహారిక. 


ఆ తరువాత నుండి ఆమె ఫోకస్ వెబ్ సిరీస్ లపై పెట్టింది. అప్పటికే 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్నకూచి' లాంటి సిరీస్ లతో ప్రేక్షకులను మెప్పించింది. హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సమయంలోనే నీహారికకు గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యతో వివాహం జరిగింది. గతేడాది డిసెంబర్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. మొత్తం మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో కనిపించింది. వివాహం తరువాత నీహారిక తన భర్త చైతన్యతో కలిసి సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విషయాలను పంచుకుంటూ హడావిడి చేస్తుంది. ఈ మధ్యనే వీరిద్దరూ కలిసి మాల్దీవులు, పాండిచ్చేరి లాంటి ప్రాంతాలకు ట్రిప్ కు వెళ్లొచ్చారు.


దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నీహారిక. ఇదిలా ఉండగా.. తాజాగా నీహారిక భర్త చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. గత అర్ధరాత్రి నీహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగిందని.. ఆమె భర్త చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలానే నీహారిక భర్త సైతం అపార్ట్మెంట్ వాసులపై మరో ఫిర్యాదు చేశారు. ఇరువురి తరఫున ఫిర్యాదులు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 


కాంప్రమైజ్ : 

 

మంగళవారం నాడు జరిగిన వాగ్వాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించిన పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇరువరు రాజీ వచ్చారని, కేసును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. 

ఇక నీహారిక కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారింది. రీసెంట్ ఓ కొత్త వెబ్ సిరీస్ ఒప్పుకుంది. భాను రాయుడు డైరెక్ట్ చేయనున్న ఈ సిరీస్ లో యూట్యూబర్ నిఖిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలానే హాట్ యాంకర్ అనసూయ (Anasuya) కీలకపాత్ర పోషిస్తుంది. 


 




Also Read : MAA Dispute : తెగేదాకా లాక్కోవద్దని హెచ్చరించిన ప్రకాష్ రాజ్..! ఎవరిని..?


Anasuya Photos: : బ్లాక్ కలర్ శారీలో బ్యాక్ లెస్ ఫోజులు.. మాయ చేస్తోన్న అనసూయ