Citadel: Honey Bunny Trailer 2 : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత, బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. హాలీవుడ్ లో ఇండియన్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటించిన ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్ గా ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన రాజ్, డీకే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నది. త్వరలో ప్రేక్షకుల ముదుకు రాబోతున్నది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగా ‘సిటాడెల్: హనీ బన్నీ’కి సంబంధించిన రెండో ట్రైలర్ ను విడుదల చేశారు.
యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టిన సమంత
‘సిటాడెల్: హనీ బన్నీ’కి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలను పెంచేసింది. తాజాగా రెండో ట్రైలర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. గతంలో ఎప్పుడూ కనిపించని రీతో సమంతా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది. అమ్మడు యాక్టింగ్ చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ ముద్దుగుమ్మ స్టంట్స్ చూసి వారెవ్వా అంటున్నారు. కొంత మంది సామ్ ఫ్యాన్స్ అయితే ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ కంటే ఈ ట్రైలర్ బావుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు సమంత చేసిన యాక్షన్ వెబ్ సిరీస్ లను తలదన్నేలా ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఉండబోతుందంటున్నారు అమె అభిమానులు. ఈ వెబ్ సిరీస్ లో హనీగా సమంత, బన్నీగా వరుణ్ ధావన్ అదరగొట్టేశారు.
సమంత యాక్షన్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆడియెన్స్
చాలా రోజుల తర్వాత సమంత యాక్షన్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సిరీస్ కోసం ఆమె అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికిందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్ కిత్ పరిహార్, కష్వీ మజ్ముందర్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు డి2ఆర్ ఫిల్మ్స్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించాయి. నవంబర్ 7న హిందీ, తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళంలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో ‘ఫ్యామిలీ మ్యాన్‘ సీజన్ 2లో నటించిన సమంత.. ఇప్పుడు మరోసారి వారితో కలిసి పనిచేస్తోంది.
Read Also: టీనేజ్ కుర్రాళ్ల తప్పటడుగులు... రియలిస్టిక్‌గా ఆకట్టుకుంటున్న ‘ముర’ ట్రైలర్