అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు కారణం ఏంటి? సంసార జీవితం మీద ప్రస్తుతం సమంతకు ఎటువంటి అభిప్రాయం ఉంది? - ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో 'కాఫీ విత్ కరణ్' షోలో ఆమె పార్టిసిపేట్ చేస్తున్నారని తెలిసి చాలా మంది పెళ్లి గురించి మాట్లాడే అవకాశం ఉందని ఊహించారు. ఎందుకంటే... సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత విషయాలు రాబట్టడంతో కరణ్ జోహార్ దిట్ట. ఈ రోజు విడుదలైన ప్రోమో చూస్తే అది నిజమే అని తెలిసింది. పెళ్లి గురించి సమంత పెదవి విప్పారు.
Samantha Blames Karan Johar For Unhappy Marriages : ''అన్ హ్యాపీ మ్యారేజెస్ (సంతోషంగా లేని సంసార జీవితాల)కు నువ్వే కారణం. జీవితం 'కభీ ఖుషి కభీ గమ్'లా ఉంటుందని చూపించారు. రియాలిటీ ఏంటంటే... 'కెజియఫ్'లా ఉంటుంది'' అని 'కాఫీ విత్ కరణ్'లో సమంత చెప్పారు. ఇంకా ఆమె చెప్పారనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి.
Also Read : ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ
ఈ నెల (జూలై) 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో 'కాఫీ విత్ కరణ్' ఏడో సీజన్ స్టార్ట్ కానుంది. అక్షయ్ కుమార్, సమంత ఒక ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు. ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Also Read : మళ్ళీ కొత్త లుక్‌లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్