Actress Hema MAA Membership Will Be cancel: సినీ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. హేమ అరెస్ట్ ఆమె మా నుంచి సస్పెండ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హేమ మా సభ్యత్వంపై మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హేమ మా సభ్యత్వం రద్దుపై ఆయన సభ్యుల అభిప్రాయాలు సేకరించారట. ఈ మేరకు మా అసోసియేషన్ గ్రూప్‌లో ఇప్పటికే మంచు విష్ణు సందేశాలు పంపించారని సమాచారం.
దీనిపై ప్యానెల్ సభ్యుల నుంచి హేమ సభ్యత్వం రద్దు చేయాల్సిందే అన్నట్టు సమాధానాలు రావడంతో మంచు విష్ణు దీనిపై ఫైనల్ డెసిజన్ తీసుకున్నట్టు సినీవర్గాల్లో సమాచారం. ప్యానెల్ సభ్యుల అభిప్రాయాల మేరకు మా అధ్యక్షుడిగా విష్ణు హేమ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారట. రేపు(జూన్ 6) ఆయన దీనిపై అధికారిక ప్రకటన వెల్లడించనున్నారట. రేవ్ పార్టీ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చేంతవరకు ఆమెను మా నుంచి సస్పెండ్ చేయాలని ఆయన నిర్ణయం తీసున్నట్టు తెలుస్తోంది.
కాగా గత మే నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె దొరకడంతో కవర్ చేసుకునేందుకు తాను హైదరాబాద్‌లోనే ఉన్నట్టుగా డ్రామాలు ఆడింది. బెంగళూరు పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్టు చెప్పిన కూడా వాటిని కొట్టిపారేసింది. ఆమె రక్తనమూనాలు సేకరించి వైద్య పరీక్షలు చేయగా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చి రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం హేమను పోలీసుల రిమాండ్‌లోనే ఉంది.
ఫేక్ వీడియోతో హేమ డ్రామాలు
తొలుత మే 20న బెంగళూరులో రేవ్ పార్టీ విషయం బయటికి రాగానే అందులో హేమ కూడా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ పార్టీలో హేమ కూడా ఉందని, ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నామంటూ స్వయంగా బెంగళూరు పోలీసులే వెల్లడించారు. అయినా కూడా ఈ విషయం బయటకు రాగానే హేమ తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. ఫాంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్నానంటూ ఓ వీడియో విడుదల చేసింది. కానీ, బెంగళూరు పోలీసులు పార్టీలో ఆమె ఫోటోలు విడుదల చేయడంతో.. హేమ చేసినది ఫేక్ వీడియో అని తేలిపోయింది. అంతేకాదు ఆ మరసటి రోజు తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ వండుతున్న వీడియో షేర్ చేసింది.
ఈ వీడియోపై కూడా నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇదంతా కావాలనే చేస్తుందని, హైదరాబాద్‌లోని ఇంట్లోనే ఉన్నానని చెప్పేందుకు డ్రామాలు చేస్తుందంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఇక బెంగళూరు పోలీసులు తమ విచారణలో భాగంగా పార్టీకి హాజరైన అందరి రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ టెస్ట్ చేయించారు. ఇందులో హేమతో పాటు మొత్తం 86 మందికి పాజిటివ్‌గా తేలింది. అలా పాజిటివ్ వచ్చిన వారు అందరికీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదే క్రమంలో నటి హేమకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదటిసారి ఆమె అనారోగ్యం కారణంగా గైర్హాజరు కాగా.. ఇప్పుడు మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు.