Animal entry song Jamal Kudu Singer : అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ అగ్ర హీరో రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన 'యానిమల్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. డిసెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్ లో స్టడీ కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.850 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని రణ్ బీర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతోపాటు ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ 'జమాల్ కుడు' ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ సాంగ్ మార్మోగిపోతుంది. దేశవ్యాప్తంగా ట్రెండ్ అవడంతో పాటు ఇన్ స్టా రీల్స్ లో, రింగ్ టోన్స్ లో ఎక్కడ విన్నా ఈ పాటే వినిపిస్తోంది. ఇక యూట్యూబ్లో దుమ్ము లేపిన ఈ సాంగ్ సినిమాలో విలన్ అయిన బాబి డియోల్ ఎంట్రీ తో వస్తుంది. ఈ పాటను కొంతమంది అమ్మాయిలు పాడుతుంటే ఆ మ్యూజిక్ బాబీ డియోల్ డాన్స్ చేస్తుంటారు. అయితే ఈ సాంగ్ పాడిన వారిలో మిడిల్ లో మెయిన్ సింగర్ గా ఉన్న అమ్మాయి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ అమ్మాయి పాట పాడుతున్న తీరు, ఎక్స్ప్రెషన్స్, లుక్స్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆమె ఎవరని సోషల్ మీడియాలో వెతకడం మొదలుపెట్టారు.


దీంతో ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి పేరు 'తన్నాజ్ దవూరి'. ఇరాన్ కి చెందిన ఈ అమ్మాయి మోడలింగ్ చేసింది. డాన్సర్ గా పలు స్టేజి షోల్లో బాలీవుడ్ సాంగ్స్ కి పర్ఫామెన్స్ ఇచ్చింది. విదేశాల్లో బాలీవుడ్ స్టార్స్ నోరా ఫతేహి, వరుణ్ ధావన్, జాన్ అబ్రహం, సన్నీ లియోన్ లతో కలిసి డాన్స్ షోలు ఇచ్చింది. అయితే ఆ స్టేజి షోలతో రాని గుర్తింపు తన్నాజ్‌కి.. ఈ జమాల్ కుడు సాంగ్ తో వచ్చింది. ఈ పాటతో ఫేమ్ తెచ్చుకోవడంతో.. తన్నాజ్ సోషల్ మీడియా ఫాలోవర్స్ అకౌంట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక అనిమల్ రిలీజ్ కి ముందు తన్నాజ్ దవూరికి ఇన్ స్టాగ్రామ్ లో పదివేల మంది ఫాలోవర్స్ ఉండగా యానిమల్ రిలీజ్ తర్వాత జమాల్ కుడు సాంగ్ తో ఒక్కసారిగా ఫేమస్ అవడంతో కేవలం రెండు వారాల్లోనే ఈమె ఫాలోవర్స్ సంఖ్య 2.6 లక్షలకు చేరింది.


ఇక్కడితో ఆగకుండా రోజురోజుకీ ఈమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దాంతో సోషల్ మీడియాలో ఈమె కూడా న్యూ నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక జమాల్ కుడు సాంగ్ విషయానికొస్తే.. 1950 లలోని ఇరానియన్ సాంగ్. ‘ఓ నా ప్రేమ.. ప్రియమైన.. నా మధురమైన ప్రేమ’ అనే మీనింగ్ వచ్చేలా ఈ పాట ఉంటుంది. ఓల్డ్ ఇరానియన్ పాటను సందీప్ వంగ ఫ్రెష్ మ్యూజిక్ తో రీక్రియేట్ చేయించారు. అది కాస్త ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయింది.


Also Read : 'హనుమాన్' మూవీలో రవితేజ - సంక్రాంతికి డబుల్ ట్రీట్ గ్యారెంటీ!