Mass Maha Raja Raviteja Vocie Over In 'Hanu-Man' : టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హనుమాన్' వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ ఈ మూవీతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అయింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది.


రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా హనుమాన్ మూవీ నుంచి ఓ సర్ప్రైజింగ్ అప్డేట్ ని అందించారు. అదేంటంటే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా భాగమవుతున్నారు. అంటే సినిమాలో ఆయన కనిపించడు కానీ ఆయన గొంతు వినిపించనుంది. హనుమాన్ సినిమాకి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమాలో ‘కోటి’ అనే కోతి పాత్రకు రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. అదే విషయాన్ని మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. రవితేజ మైక్ ముందు డబ్బింగ్ చెబుతున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


గతంలో రవితేజ సునీల్ హీరోగా వచ్చిన 'మర్యాద రామన్న' సినిమాలో సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన 'అ!' అనే సినిమాలో చేప కి వాయిస్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరోసారి హనుమాన్ సినిమాలో ఓ కోతి పాత్రకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. మొదటి రెండు సినిమాల్లో రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయింది. సో ఇప్పుడు హనుమాన్ లో కూడా అదే రిపీట్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇదే సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' సినిమాని రిలీజ్ చేస్తున్నారు. తనకు పోటీగా రిలీజ్ అవుతున్న సినిమాకి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.


సుమారు రూ.75 కోట్ల బడ్జెట్ తో గ్రాఫిక్స్, VFX ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుంది. కోలీవుడ్ యాక్టర్ వినయ్ రాయ్ విలన్ గా కనిపించబోతున్నాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలతో పాటు ఇంగ్లీష్ స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ సహా మరికొన్ని విదేశీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : ఓ మై గాడ్, రణబీర్‌ను రష్మిక అన్నిసార్లు కొట్టిందా? అసలు విషయం చెప్పిన ‘యానిమల్‘ నిర్మాత