Real Story of The Goat Life Man Najeeb Muhammad: ఎడారి దేశంలో గొర్రెలనను మెపుతూ బానిసగా బతికిన నజీబ్‌ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను స్క్రిన్‌పై చూసే అంతా అయ్యే అనుకున్నారు. అలాంటిది నిజం జీవితంలో ఎడారిలో ఒంటరిగా 700 గొర్రెలను మెపాడు. తిండి, నీళ్లు లేక ఇసుకతోనే మూడేళ్లు సావాసం చేశాడు. పరాయి దేశంలో పలకరించే మనిషి, బాధనిపిస్తే చెప్పుకునే ఆప్తులు లేక బానిసగా బ్రతికిన రియల్‌ నజీబ్‌ మహమ్మద్‌ను చూశారా. అక్కడ అతడు పడిన కష్టాలు, ఎదురైన ప్రమాదాలు.. చివరికి ప్రాణం మీదే ఆశలు వదులేసుకున్న అతడి ధీనగాధ స్వయంగా ఆయన మాటల్లోనే చూడండి! 'గోట్‌ లైఫ్‌' రిలీజ్‌ నేపథ్యంలో నజీమ్‌ ఇటీవల ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మూడేళ్ల పాటు మాట్లాడే మనిషి లేక కేవలం గొర్రెలతోనే ఎడారి దేశంలో గడిపిన కష్టాలు అతడు పడిన సంఘర్షణ ఇక్కడ చూడండి!


ఎన్నో ఆశలతో విమానం ఎక్కాడు..


అది 1993 సంవత్సరం. అప్పట్లో దక్షిణాది చాలామంది ఎడారి దేశానికి ఉపాధి కోసం వలస కూలిలుగా మారిన రోజులు. కుటుంబ పోషణ కోసం నజీబ్ కూడా సౌదీ వెళ్లాలనుకున్నాడు. అనుకన్నట్టే ఓ ఏజెంట్‌ సహాయంలో సౌదీ పయనమయ్యాడు. అక్కడ ఒక మాల్‌లో సేల్స్‌మ్యాన్‌గా పని అన్నారు. కష్టపడి డబ్బులు సంపాదించి కుటుంబానికి పంపాలని, ఆర్థికంగా ఎదగాలనే ఎన్నో ఆశలతో విమానం ఎక్కాడు. అనుకున్నట్టే సౌదీ ఎయిర్‌పోర్టులో దిగాడు. అక్కడ దిగాక మాల్‌లో పని అంటూ తీసుకువెళ్తున్నారు. కానీ రెండు రోజులైన అతడి గమ్యం రావడం లేదు. చూట్టూ ఎడారి ఉంది. ఏ మనిషి కనిపించడం లేదు. ఇక అప్పుడే తాను మోసపోయానని అర్థమైందట నజీబ్‌కి. ఎడారి లోపల తనని అరబ్‌ షేక్‌కు అప్పజెప్పారట. ఆ షేక్‌ అక్కడే ఒక షెడ్డు వేసుకుని ఉండేవాడు. నజీబ్‌కు 700 గొర్రెలను కాచే పని అప్పజెప్పాడట కానీ, తనకి వేరే బట్టలు ఇవ్వలేదు. స్నానానికి నీళ్లు ఇవ్వలేదు.


ముతక రొట్టెలతో ఆకలి తీర్చుకుంటూ..


బతకడానికి మాత్రం ముతక రొట్టెలు ఇచ్చేవాడట. ఆ రొట్టెల్ని గొర్రెపాలలో తడిపి కొద్దిగా తినేవాడట నజీబ్‌. యజమాని, అతని తమ్ముడు ఈ ఇద్దరు మాత్రమే నజీబ్‌కు కనిపించేవారట. రెండేళ్లు మరో వ్యక్తని చూడలేదట. మాట్లాడలేదట. తన కష్టాన్ని చూసి అయ్యే పాపం అనేవారు కూడా లేరు. చివరికి తన స్థితిని చూసుకుని ఏడ్చిన ప్రతిసారి ఆ యాజమాని సోదరులు కొడుతుండేవారంటూ నజీబ్‌ చేదు రోజులను గుర్తు చేసుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. "నాకు ఉండటానికి నీడ, వేసుకోవడానికి బట్టలు, స్నానానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. 700 గొర్రెలను అప్పగించారు. తినడానికి ముతక రొట్టెలు ఇచ్చేవారు. అవి పొడిగా ఉండటం వల్ల గొర్రెల పాలు పితుక్కుని అందులో నానబెట్టుకుని తినేవాడిని. గొర్రెలకు కూడా స్నానం లేకపోవడం ఆ పాలు వాసన వచ్చేవి.


అయినా మరో దారి లేక అందులో ముంచుకుని తిన్నాను. ఒక్కోసారి నేను కూడా ఈ గొర్రెలతో ఒక గొర్రెనే అని అనిపించింది. నేను ఏడ్చినప్పుడల్లా వారు కాస్తా కూడా జాలి చూపించకుండ కొట్టేవారు. యజమాని, అతడి సోదరుడు తప్పితే మరో మనిషి కనిపించలేదు. ఇక నాకు బయటపడే మార్గం లేదని అర్థమైంది. ఇక్కడే చనిపోతానేమో అనుకున్నాను. నా కుటుంబం గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చేవాడిని. ఎందుకంటే నేను సౌదీ వెళ్లే సమయానికి నా భార్య గర్భవతి. ఆమెకు కొడుకు పుట్టాడా? కూతురు పుట్టిందా? అన్న సమాచారం కూడా లేదు. అలా జీవితంపై ఆశలు వదిలేసుకున్న నాకు ఒకరోజు అన్నదమ్ముళ్లు (యజమాని) పెళ్లి కోసమని ఊరెళ్లారు. అదే సమయం అనుకుని ఆ ఎడారి దేశంలో తప్పించుకుని పరుగుపెడుతూనే ఉన్నాను.  దారి తెలియదు.. గమ్మం ఎటో  తెలియదు. పరిగేడుతూనే ఉన్నాను. అలా ఒకటిన్నర రోజు తర్వాత నాకు మా మలయాళి వ్యక్తి కనిపించి దారి చెప్పాడు.



అప్పుడు అతడు కూడా నా పరిస్థితిలో ఉన్నాడు. చివరకు ఒక రోడ్డు కనిపించి రియాద్‌ చేరుకున్నాను. అక్కడి మలయాళీలు నన్ను కాపాడారు. ఆ నేను తర్వాత పోలీసులను ఆశ్రయించగా.. సరైనా పత్రాలు లేవని నన్ను జైల్లో పెట్టారు. అలా పది రోజులు రిమాండ్‌లో ఉంచి నన్ను ఇండియాకు తిరిగి పంపించారు" అంటూ నజీబ్‌ చెప్పుకొచ్చాడు.  కాగా పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా 'ది గోట్ లైఫ్ - ఆడు జీవితం'. నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. బతుకు దెరువు కోసం సౌదీ వెళ్లిన మలయాళీ ముస్లిం నజీబ్ ఎడారి దేశంలో ఎన్ని కష్టాలు పడ్డాడు? అక్కడి నుంచి తను భారత్‌కు తిరిగి ఎలా వచ్చాడు? అనేది సినిమా. వాస్తవంగా జరిగిన కథ ఇది. బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం' (గోట్ డేస్) నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.  మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది.


Also Read: ఓటీటీకి ఆస్కార్ విన్నింగ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్'- తెలుగులోనూ స్ట్రీమింగ్‌, ఎక్కడంటే