Anatomy Of a Fall Movie Streaming in Amazon Prime: ఓటీటీలోకి ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ వచ్చేసింది. అదే 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్' మూవీ. ఆస్కార్‌తో పాటు దాదాపు వందకు పైగా అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇప్పటికే తెలుగులో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది. కాగా ఇటివల జరిగిన 96వ ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్' అవార్డును గెలుచుకుంది. అంతేకాదు మొత్తం అయిదు విభాగాల్లో అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ నామినేట్ అయ్యింది.


బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆస్కార్ అవార్డు


అవి.. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో ఈ సినిమా నామినేట్‌ అవ్వగా.. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కింది. కేవలం అకాడమీ అవార్డ్ మాత్రమే కాకుండా అనేక అవార్టును కూడా అందుకుంది ఈ చిత్రం. రీసెంట్‌గా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ మూవీగా నిలిచింది. బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్, సిడన్నీ ఫిల్మ్ ఫెస్టివల్, యూరోపియన్ ఫిల్మ్ అవార్డ్స్ తోపాటు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకుంది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో మూవీ లవర్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ముఖ్యంగా రిజనల్‌ లాంగ్వెజస్‌లోనూ'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్' స్ట్రీమింగ్‌కి రావడం మరో విశేషం. 


మొత్తం థ్రిల్లింగ్ అంశాలతో..


కథ విషయానికి వస్తే..సాండ్ర వోయిట‌ర్ ఓ ర‌చ‌యిత‌. తన కుటుంబంతో కలిసి మంచు కొండలలో ఒంటరిగా జీవిస్తుంటుంది. ఒకరోజు అనుకోకుండా సాండ్ర భర్త అనుమానస్పద రితీలో మరణిస్తాడు.కానీ, ఈ హత్య నేరం సాండ్ర వోయిటర్‌పై పడుతుంది. ఎందుకంటే అతడు మరణించిన టైంలో అక్కడ సాండ్ర తప్ప మరెవరు ఉండరు. దీంతో సాండ్రనే తన భర్త హత్య  చేసి ఉంటుందని పోలీసులు ఆమెను అనుమానిస్తారు. ఈ క్రమంలో ఆమెను విచారిస్తున్న క్రమంలో ఎలాంటి పరిణామాలు వచ్చాయి. తనని నిర్ధోషిగా ప్రూవ్‌ చేసుకోవడానికి సాండ్ర ఏం  చేసింది. అసలు ఆమె భర్తని ఎవరు చంపారు, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది వంటి అంశాలను చాలా ఆసక్తిగా చూపించాడు దర్శకుడు.


క్షణం క్షణం ఈ సినిమా ఉత్కంఠతో సాగుతూ ప్రేక్షకులను కళ్లు ఆర్పకుండ చేస్తుంది. చివరి వరకు కూడా ఈ సినిమా ఆడియన్స్‌లో క్యూరియసిటి పెంచుతుంది. 2023లో జ‌స్టిన్ ట్రైట్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఫ్రెంచ్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాలోని విజువ‌ల్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి.  కాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సాండ్ర హ‌ల్ల‌ర్ తన నటననతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తన అవుట్‌ స్టాండింగ్‌ పర్ఫామెన్స్‌కు ఆస్కార్‌ అవార్డు కూడా నామినేట్‌ అయ్యింది. అయితే తృటిలో అవార్డును మిస్స‌యింది. సాండ్ర హ‌ల్ల‌ర్‌తో పాటు స్వాన్ అర్లాడ్‌, మిలో మ‌కాడో గ్రాన‌ర్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించారు.