Kriti Sanon: హీరోయిన్ కృతి సనన్ బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా? వేల కోట్లకు వారసుడు, అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే
Kriti Sanon Boyfriend: గత కొంతకాలంగా కృతి సనన్, కబీర్ బహియా రిలేషన్షిప్ లో ఉన్నారంటూ రూమర్లు విన్పిస్తున్నాయి. మరి కబీర్ ఆస్తులు, ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

హీరోయిన్ కృతి సనన్ ఇటీవల కాలంలో తన ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ తోనే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బ్యూటీ కబీర్ బహియతో ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రీసెంట్ గా ఈ జంట ముంబైలోని ఓ రెస్టారెంట్లో నుంచి అర్ధరాత్రి బయటకు వెళ్తుండగా ఫోటోగ్రాఫర్లు వాళ్ళను చుట్టుముట్టారు. అయితే ఆ టైంలో కబీర్ సిగ్గుపడుతూ కెమెరాకు ముఖాన్ని చాటేయడం, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. దీంతో ఈ కబీర్ బహియా ఎవరు అనే విషయాన్ని ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు.
కబీర్ బహియా ఎవరు ?
కబీర్ బహియా 2020లో స్థాపించిన వరల్డ్ వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ అనే ఎయిర్ లైన్ సంస్థ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్. రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బహియా తండ్రి పేరు కుల్జిందర్ బహియ. యూకేకి చెందిన ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సౌతాల్ ట్రావెల్ కు ఆయన ఓనర్. ఇక బహియా కుటుంబం ఆస్తుల విలువ సుమారు రూ. 4000 కోట్లుగా ఉంటుందని ఒక అంచనా. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే... క్రికెట్ ప్రపంచంలో ఎమ్మెస్ ధోని, హార్దిక్ పాండ్యా వంటి సెలబ్రిటీలతో మంచి రిలేషన్ ఉంది. అంతే కాకుండా ఆయనకు ఎంఎస్ ధోని భార్య సాక్షి రిలేటివ్ అవుతాడని ప్రచారం జరుగుతుంది.
Also Read: నన్నొక క్రిమినల్‌లా ట్రీట్ చేశారు... సమంతతో విడాకులపై నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్
కాగా గత కొంతకాలంగా కృతి - కబీర్ రిలేషన్షిప్ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే వాళ్ళు అప్పుడప్పుడు బయటకు వెళ్తూ కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడం ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసాయి. ఇద్దరూ తమ రిలేషన్ ను ఇప్పటిదాకా కన్ఫామ్ చేయకపోయినా, గ్రీస్ లో ఎంఎస్ ధోని, ఆయన భార్యతో కలిసి ఈ జంట క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం వార్తల్లో నిలిచింది.
ధనుష్ కు జోడీగా...
ఇక కృతి ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే... ఆమె చివరిసారిగా 'తేరి బాటోన్ మే ఉల్టాజియా' అనే సినిమాలో షాహిద్ కపూర్ తో కలిసి కనిపించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, నెక్స్ట్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందబోతున్న 'తేరే ఇష్క్ మే' సినిమాలో ధనుష్ తో కలిసి నటించబోతోంది. ఇక తెలుగులో ఈ బ్యూటీ 'వన్ నేనొక్కడినే' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అలాగే 'ఆది పురుష్' మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దురదృష్టవశాత్తు ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు తెలుగు సినిమాలు కూడా నిరాశ పరచడంతో మళ్లీ ఆమె తెలుగు సినిమాల వైపు చూడలేదు. కానీ హిందీలో మాత్రం వరుస హిట్స్ తో దూసుకెళ్తోంది.