Deepika Rejected Movies List : స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది దీపికా పదుకొనే. అడుగుపెట్టిన వేళా విశేషమో ఏమో.. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. పెళ్లై, తల్లైనా అదే క్రేజ్ మెంటైన్ చేయడంలో సక్సెస్ అయింది. అందుకే భారీ ప్రాజెక్టుల్లో ఫస్ట్ ఫ్రిపరెన్స్ గా మారింది దీపిక. అయితే వరుసగా రెండు పెద్ద సినిమాల నుంచి తప్పించడంతో అందరి చూపూ దీపికవైపే అన్నట్టుంది. అందం, నటనలో నూటిని నూరు మార్కులు సొంతం చేసుకుని..కెరీర్లో దూసుకెళ్తున్న బీటౌన్ బ్యూటీ ఇప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది? తప్పించేవరకూ పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేసుకుంటోందన్నదే హాట్ టాపిక్. అయితే దీపిక సినిమాల నుంచి తప్పుకోవడం (తప్పించడం) ఇదే మొదటిసారి కాదు..ఈ జాబితాలో చాలా సినిమాలున్నాయ్.
దూమ్ 3 (Dhoom 3)
2013 లో వచ్చిన ఈ మూవీలో ఆమిర్ ఖాన్ కి జోడీగా ఫస్ట్ దీపిక పదుకొనే అనుకున్నారు. దాదాపు ఖరారైందనుకున్న టైమ్ లో.. అంతకుముందు కమిటైన ప్రాజెక్ట్స్ డేట్స్ తో క్లాష్ రావడంతో డ్రాప్ అయింది. అప్పుడు దీపిక ప్లేస్ లో కత్రినాను తీసుకున్నారు. బాలీవుడ్ లో కలెక్షన్లపరంగా భారీగానే వసూలు చేసింది దూమ్ 3
జబ్ తక్ హై జాన్ (Jab Tak Hai Jaan)
బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్ లో షారుక్-దీపిక జోడీ ఒకటి. తను ఎంట్రీ ఇచ్చిందే షారుక్ మూవీతో..అయితే మరోసారి షారుక్ తో నటించే అవకాశం వచ్చినప్పటికీ వ్యక్తిగతకారణాలతో ఆ సినిమాలో నటించలేకపోయింది దీపిక. ఈ ప్రాజెక్ట్ లోనూ దీపిక ప్లేస్ లో కత్రినాను తీసుకొచ్చారు మేకర్స్. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ హిట్
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 (Fast & Furious 7)
2015 లో వచ్చిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ప్రాజెక్ట్ లో భాగం కావాల్సిన దీపిక.. అప్పటికే హ్యాపీ న్యూ ఇయర్ కమిట్‌మెంట్ వల్ల డేట్స్ కేటాయించలేకపోయింది. దీపిక బదులు జెస్సీకా అల్బాను తీసుకున్న ఆ సినిమా గ్లోబల్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది
సల్మాన్ వరుస ప్రాజెక్ట్స్
సల్మాన్ ఖాన్ - దీపిక జోడిని ఆన్ స్క్రీన్ చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. కారణాలు ఏమైనా కానీ ఈ జోడీ సెట్టవలేదు. ఎందుకంటే జై హో, సుల్తాన్ , ప్రేమ్ రతన్ ధన్ పాయో, కిక్ ...సహా భాయ్ చాలా సినిమాల్లో దీపిక హీరోయిన్ అని అనుకున్నారు. కానీ ఆఖరి నిముషంలో దీపిక తప్పుకోవడం(తప్పించడం)..ఆ ప్లేస్ ని మరో హీరోయిన్ తో రీప్లేస్ చేయడం కామన్ అయిపోయింది. అలా 2016 లో వచ్చిన సుల్తాన్ మూవీలో అనుష్క శర్మ నటించింది. ఈ మూవీ 600 కోట్లకు పైగా వసూలు చేసింది. 2015లో వచ్చిన ప్రేమ్ రతన్ ధన్ పాయో లో దీపిక ప్లేస్ లో సోనమ్ కపూర్ ని తీసుకున్నారు.. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిందీ సినిమా
ఇలా...బాలీవుడ్ లో దీపిక తప్పుకున్న సినిమాలన్నీ భారీ ప్రాజెక్టులే , స్టార్ హీరోస్ వే కావడం ఆసక్తికరం. వీటిలో కొన్ని సినిమాలకోసం డేట్స్ కుదరక, మరికొన్ని కాంబినేషన్ సెట్టవ్వక, ఇంకొన్ని రెమ్యునరేషన్ విషయంలో తేడాలతో చేజారిన ప్రాజెక్టులే.
2025లో ఏకంగా రెండు భారీ ప్రాజెక్టులు..అవి కూడా పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్నవి.. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ తెరకెక్కిస్తున్నవి. అందుకే సోషల్ మీడియాలో దీపిక హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే సందీప్ తెరకెక్కించిన సన్షేషనల్ హిట్ మూవీ యానిమల్ లో త్రిప్తి నటించింది. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఉన్నది కొద్దిసేపే అయినా కానీ...బాగా హైలైట్ అయింది. దీపిక తప్పుకోవడంతో స్పిరిట్ లో ప్రభాస్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ త్రిప్తికి వచ్చింది.
మరి కల్కి 2898 AD లో దీపిక ప్లేస్ ని ఎవరితో రీప్లే చేస్తారో చూడాలి. సోషల్ మీడియాలో మాత్రం కీర్తి సురేష్, ఆలియా భట్, మృణాల్ ఠాకూర్ సహా పలువురు పేర్లు వినిపిస్తున్నాయ్...వీరిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి..
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ దీపిక కొన్ని ప్రాజెక్టులు రిజెక్ట్ చేసిన తర్వాత వాటి కారణంగా నష్టపోలేదు..కెరీర్లో మరింత జోరు కొనసాగించింది.