బాలీవుడ్ లో 'ధూమ్' సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకు 'ధూమ్' ఫ్రాంచైజీ నుంచి మూడు సిరీస్ లు వచ్చాయి. అన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. 2004లో హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ లీడ్ రోల్స్ ప్లే చేసిన 'ధూమ్2' ఈ ఫ్రాంచైజీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమాలో హృతిక్ రోషన్ స్టైల్, స్వాగ్ అలాగే ఐశ్వర్యరాయ్, హృతిక్ ల మధ్య రొమాంటిక్ సీన్స్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలో హృతిక్ - ఐశ్వర్యరాయ్ మధ్య వచ్చే లిప్ లాక్ సీన్ అప్పట్లో ఎంత పెద్ద హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఈ సీన్ చేయడంపై ఐశ్వర్యరాయ్ పై అప్పట్లో ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అయితే సినిమాలో హృతిక్ రోషన్ తో లిప్ లాక్ సీన్స్ చేసిన తర్వాత ఐశ్వర్యారాయ్ కి కొన్ని లీగల్ నోటీసులు కూడా వచ్చాయట. నిజానికి సినిమాల్లో అలాంటి సీన్స్ చేయడం తనకు అంత కంఫర్ట్ గా ఉండదని ఇటీవల ఓ సందర్భంలో చెప్పింది ఐశ్వర్యరాయ్.


ఇదిలా ఉంటే 2012లో ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాయ్ 'ధూమ్2' సినిమాలో హృతిక్ రోషన్ తో చేసిన లిప్ లాక్ సీన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ధూమ్2' సినిమాలో నేను ఒక్కసారి మాత్రమే హృతిక్ రోషన్ తో లిప్ లాక్ సీన్ చేశాను. అది సినిమాలో భాగంగానే జరిగింది. కానీ ఆ తర్వాత నాకు కొంతమంది దగ్గర్నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి. "మీరు ఒక ఐకానిక్ ఉమెన్. ఎంతో మంది ఆడపిల్లలకి మీరు ఒక ఆదర్శం. అలాంటిది మీరు సినిమాల్లో ఇలా ముద్దు సన్నివేశాల్లో నటించడం ఏమాత్రం బాలేదు. మీరు ఇలాంటి సీన్స్ ఎందుకు చేశారు?" అని చాలామంది నన్ను అడిగారు. "అలాంటి కామెంట్స్ చూసి నేను ముందు ఆశ్చర్యపోయా. నేను ఓ యాక్టర్ ని. నా జాబ్ నేను చేస్తున్నా. నిజానికి అదే సమయంలో హాలీవుడ్ నుంచి యూరోపియన్ సినిమాస్, ఇంగ్లీష్ మూవీ మేకర్స్ కి నాపై ఎంతో ఆసక్తి ఉంది. నేను కూడా రొమాంటిక్ సీన్స్, కిస్ సీన్స్ చేయడం నచ్చక కొన్ని హాలీవుడ్ లో కొన్ని స్క్రిప్ట్స్ ని రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నాకు అలాంటి సన్నివేశాలు చేయడం కంఫర్టబుల్గా అనిపించదు" అని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా.. "నేను వెండితెరపై అలాంటి సన్నివేశాల్లో నటించడం నాతోపాటు నా అభిమానులకు కూడా ఇష్టం లేదు. అలాగే ప్రేక్షకులకు కూడా నేను స్క్రీన్ పై అలాంటి సన్నివేశాలు చేయడం నచ్చదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను ఇలాంటి సన్నివేశాలు చేయాల్సి వస్తే అది మన ఇండియన్ సినిమాలోనే చేస్తాను. నాకంటే ముందు ఎంతోమంది నటులు ముద్దు పెట్టుకున్నారు. ఇప్పటికీ అలాంటి సన్నివేశాల్లో నటిస్తూనే ఉన్నారు. నిజానికి మన భారతీయ సంస్థలలో బహిరంగ ప్రదర్శన అంతా సాధారణమైంది కాదు. మన సినిమాల్లో నటీనటులు ముద్దు పెట్టుకుంటూ సుఖంగా కనిపించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అది సినిమాలో భాగంగా ఒక క్రియేట్ చేయబడ్డ ఒక మూమెంట్ మాత్రమే. మాకు కూడా అలాంటి సన్నివేశాలు సౌకర్యవంతంగా ఉండవు" అని ఐశ్వర్య రాయ్ తెలిపారు. ఇక ఇటీవల తమిళ అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు ఐశ్వర్యరాయ్. విక్రమ్, కార్తి, ఆర్య, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ని అందుకుంది.


Also Read :'లింగ్డీ' సాంగ్ - ఈ పాటేంటీ అలా ఉంది? మీమర్స్‌కు మళ్లీ మసాలా దొరికేసింది!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial