షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), రాజ్ కుమార్ హిరాణీ (Rajkumar Hirani)... ఈ కాంబినేషన్‌లో సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ సినిమా ప్రకటన వచ్చింది. తామిద్దరం కలిసి 'డంకి' సినిమా (Dunki Movie) చేస్తున్నట్టు మంగళవారం ఇద్దరూ ప్రకటించారు. అయితే... ఆ సినిమా టైటిల్ చాలా మందికి అర్థం కాలేదు. కొందరు 'డాంకీ' (గాడిద) అనుకున్నారు. బహుశా... ఇదే సందేహం షారుఖ్, హిరాణీకి వచ్చి ఉంటుంది. అందుకని, సినిమా అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన వీడియోలో 'డాంకీ' కాదు, 'డంకి' అని చెప్పారు.


దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీతో 'సినిమా పేరేంటి?' అని షారుఖ్ అడిగితే... 'డంకి' అని బదులు ఇస్తారు. తనను 'డాంకీ' అంటే 'గాడిద' అని తిట్టారేమోనని  ''డాంకీనా?'' అని షారుఖ్ ఒక ఎక్స్‌ప్రెష‌న్‌ ఇస్తారు. అప్పుడు రాజ్ కుమార్ హిరాణీ  ''కాదు... డంకి'' అని చెప్పేసి వెళ్లిపోతారు. ''షారుఖ్ ఖాన్ ఇన్ అండ్ యాజ్ 'డంకి' అనుకుంటే... ఏదో తిట్టుకున్నట్లు ఉంది. అయినా పర్లేదు... అవకాశం వదలొద్దురా'' అని షారుఖ్ తనకు తాను చెప్పుకొంటూ వెళ్లిపోతాడు. 


What is the meaning of Dunki?: అసలు మ్యాటరేంటంటే... షారుఖ్ ఖాన్‌కి కూడా అర్థం కాని ఆ 'డంకి' అనే పదానికి అర్థం ఏంటి? - ఈ సందేహం చాలా మందికి వచ్చింది. దాని మీదే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. 'డంకి'కి రకరకాల అర్థాలు చెబుతూ ట్రెండ్ చేస్తున్నారు.


Also Read: 'డంకి' - షారుఖ్ ఖాన్ టైప్ రొమాన్స్ లేదంటున్న దర్శకుడు


నిజం చెప్పాలంటే... 'డంకి'కి అర్థం ఏంటనేది ట్రైలర్ చివర్లో క్లూ ఇచ్చారు రాజ్ కుమార్ హిరాణీ. టైటిల్ అక్షరాలు వేయడానికి ఓ భారీ ఎడారి ప్రాంతంలో మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నట్లు చూపించి వాళ్లపై నుంచి ఓ విమానం ఎగురుకుంటూ వెళ్తున్నట్లు చూపించారు. 'డంకి' ఫ్లైట్ అనేది వాడుక పదమే. ఇల్లీగల్ (అక్రమం)గా వేరే దేశానికి వెళ్లడం అన్నమాట. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే... చాలా మంది పనుల కోసం, పొట్టకూటి కోసం దుబాయ్, కువైట్ వంటి దేశాలకు వీసాలు, పాస్ పోర్టు లేకపోయినా అక్రమంగా వలస వెళ్లి అక్కడ కష్టాలు పడుతుంటారు. బహుశా అలాంటి సోషల్ ఇష్యూను తన కథకు బ్యాక్ డ్రాప్ గా (SRK's Dunki Movie Storyline?) హిరాణీ తీసుకుంటారని అర్థం అవుతోంది.


Also Read: మహేష్ 'సర్కారు'తో పెద్ద హిట్ కొడుతున్నాం - నిర్మాత కాన్ఫిడెన్స్, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?