ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా 'గంగూబాయి కతియావాడి' (Gangubai Kathiawadi Movie). ఇదొక బయోపిక్. ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా రూపొందించారు. దీనికి సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పుడు ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది.
'గంగూబాయి కతియావాడి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 26న (Gangubai Kathiawadi OTT Release Date) సినిమాను తమ ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.
Also Read: మంగళ సూత్రం ఏది? నుదుట సింధూరం ఎక్కడ? - ఆలియాపై ట్రోలింగ్ షురూ
'గంగూబాయి కతియావాడి' ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే... ఇటీవల బాలీవుడ్ బడా స్టార్లు నటించిన సినిమాలు థియేటర్లలో విడుదలైన నెలకు ఓటీటీలోకి వచ్చాయి. అయితే... ఆలియా భట్ సినిమా మాత్రం రెండు నెలలకు వస్తోంది.
ఆలియా భట్ పెళ్లికి ముందు థియేటర్లలో విడుదలైన చిత్రమిది. అప్పటికి పెళ్లి కబురు షికారు చేస్తోంది. దానికి తోడు ఈ సినిమాలో ఆలియా భట్ రెండు చేతులు జోడించి నమస్కరించినట్టు రణ్‌బీర్ కపూర్ నమస్కరించడం వైరల్ అయ్యింది. ఏప్రిల్ 14న వివాహ బంధంతో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ ఒక్కటైన సంగతి తెలిసిందే.
Also Read: మహేష్ 'సర్కారు వారి పాట'తో పెద్ద హిట్ కొడుతున్నాం - నిర్మాత కాన్ఫిడెన్స్, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?