Jr NTR Devara Telugu Trailer: ప్రజెంట్ జనరేషన్ హీరోల్లో నటన, భాష మీద కమాండ్ ఉన్న అతి కొద్ది మందిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. పెర్ఫార్మన్స్ విషయంలో ఆయనకు పేరు పెట్టడానికి లేదు. సరైన క్యారెక్టర్ పడితే విజృంభిస్తారు. సిల్వర్ స్క్రీన్ మీద నట విశ్వరూపం చూపిస్తారు. ఆ విశ్వరూపానికి చిన్నపాటి ఉదాహరణ అన్నట్టు ఉంది 'దేవర' ట్రైలర్ (Devara Trailer).


ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ గ్యారంటీ...
ట్రైలర్‌లో ఇంత చూపించారంటే?
ఒక్క ముక్కలో చెప్పాలంటే... రోమాంచితం. 'దేవర' ట్రైలర్ చూస్తే అభిమానులకు గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' విడుదలైన తర్వాత నుంచి తమ అభిమాన కథానాయకుడి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న వాళ్ల ఆకలిని దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) ఒక్క ట్రైలర్ ద్వారా తీర్చారని చెప్పాలి. ట్రైలర్‌లో ఇంత చూపించారంటే... ఇక సినిమాలో ఇంకెంత ఉంటుందో ఊహించుకోండి.


'ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ చూసుండాది. అందుకే ఏమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు' - 'దేవర' గ్లింప్స్‌లో ఎన్టీఆర్ చెప్పిన మాట. ఆ నెత్తురి వేట, ఎన్టీఆర్ కత్తి వేటు ఎలా ఉంటుందో చూపించారు కొరటాల శివ. మరీ ముఖ్యంగా మూడు నిమిషాల దృశ్యాల్లో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అయ్యాయి. 'దేవర'గా ఎన్టీఆర్ చేసే యాక్షన్ అదిరింది. దేవర గురించి ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు బావున్నాయి. సంభాషణల్లో కొరటాల శివ మార్క్ కనిపించింది. ట్రైలర్ చివరిలో షార్క్ మీద ఎన్టీఆర్ చేసే సవారీ హైలైట్ అంతే. ఆ ట్రైలర్ ఎలా ఉందో చూడండి. 


Also Read: షాక్ ఇచ్చిన రష్మిక... నెల తర్వాత తీరిగ్గా యాక్సిడెంట్, రికవరీ గురించి రివీల్ చేసిందిగా



సైఫ్ అలీ ఖాన్ పాత్రకు ఇంపార్టెన్స్!
Saif Ali Khan role in Devara: విలన్ ఎంత బలవంతుడు అయితే హీరోయిజం అంతకు అంత ఎలివేట్ అవుతుంది. దర్శకుడు కొరటాలకు ఈ ఫార్ములా బాగా తెలుసు. 'దేవర' ట్రైలర్ చూస్తే అది మరోసారి స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో భైరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలుసు. ఆయన పాత్రకూ ట్రైలర్‌లో ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్, సైఫ్ సీన్లు సినిమా మీద మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి.


Also Read: ఎన్టీఆర్, ఆలియాతో కరణ్ జోహార్... ఒకరికి తోడు మరొకరు, ఇద్దరికీ లాభమే!



ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఆల్రెడీ నార్త్ అమెరికాలో 'దేవర' ప్రీ సేల్స్ పది లక్షల డాలర్లు (వన్ మిలియన్) దాటాయి. ఇక ఆ అడ్వాన్స్ బుకింగ్ స్పీడ్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. సెప్టెంబర్ 27న పాన్ ఇండియా విడుదలకు 'దేవర' సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పెద్ద ఎత్తున సినిమాను విడుదల చేయనున్నారు.



ఎన్టీఆర్ సరసన నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ జంటగా కన్నడ నటి, సీరియల్ ఆర్టిస్ట్ చైత్ర రాయ్ కీలక పాత్ర చేశారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె సంయుక్తంగా చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.