Vivek Agnihotri's The Bengal Files Trailer Released: 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఆయన లేటెస్ట్ మూవీ 'ది బెంగాల్ ఫైల్స్' ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్ ఆకట్టుకోగా... ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
మారణ హోమమే...
'ఇది వెస్ట్ బెంగాల్. ఇక్కడ రెండు రాజ్యాంగాలు ఉంటాయి. ఒకటి హిందు మరొకటి ముస్లిం.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఇదే టైంలో బాంబులతో విధ్వంసం మారణహోమాన్ని చూపించారు. పశ్చిమబెంగాల్ విభజన సమయంలో జరిగిన ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. హింసాత్మక రాజకీయ గతం నేపథ్యంలో జరిగిన పరిణామాలు, హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలను చూపించారు.
ఎటు చూసిన మారణహోమమే అనేలా నిజ జీవిత ఘటనలను కళ్లకు కట్టేలా మరోసారి తెరపై ఆవిష్కరించినట్లు అర్థమవుతోంది. 'ఇది విభజన గురించి మాత్రమే కాదు. ఎందుకంటే బెంగాల్ భారతదేశానికే హైలెట్' అనే డైలాగ్స్ ఉన్నాయి.
Also Read: పవన్ కళ్యాణ్ 'ఓజీ' హీరోయిన్... కన్మణిగా ప్రియాంక మోహన్ - ఫస్ట్ లుక్ చూశారా?
ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్, ఐయామ్ బుద్ధా సమర్పణలో జీ స్టూడియోస్ ఈ మూవీని నిర్మించింది. కోల్‌కతాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కీలక కామెంట్స్ చేశారు. 'బెంగాల్ ఫైల్స్ ఓ మేల్కొలుపు కాల్. బెంగాల్‌ను మరో కశ్మీర్ కానివ్వబోమనే ఓ గర్జన. హిందూ మారణ హోమం అన్ టోల్ట్ స్టోరీ చిత్రీకరణకు ప్రామాణికతను తీసుకు రావడానికి మేము కోల్‌కతాలో ట్రైలర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. దేశం సిద్ధం కావాలి. ఎందుకంటే కశ్మీర్ మిమ్మల్ని బాధ పెడితే, బెంగాల్ మిమ్మల్ని వెంటాడుతుంది.' అని పేర్కొన్నారు.