Pawan Kalyan's OG Latest Update: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఎదురు చూస్తున్న సినిమాలలో 'ఓజీ' (OG Movie) ఒకటి. 'దే కాల్ హిమ్ ఓజీ'... అనేది కంప్లీట్ టైటిల్. ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఆయనకు జంటగా ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) కథానాయికగా నటిస్తున్నారు.
'ఓజీ'లో కన్మణిగా ప్రియాంక మోహన్!Priyanka Mohan First Look And Character Name Revealed: 'ఓజీ' నుంచి ఈ రోజు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కన్మణి పాత్రలో అలరించనున్నట్టు తెలిపారు. సాధారణంగా ఫస్ట్ లుక్ అంటే ఒక్కటే పోస్టర్ విడుదల చేస్తారు. కానీ, 'ఓజీ' టీమ్ ప్రియాంక మోహన్ లుక్స్ రెండు రిలీజ్ చేశారు. సినిమాలో ఓజాస్ గంభీర పాత్రలో ఆవిడ నటిస్తున్నట్టు అర్థం అవుతోంది.
'ఓజీ' గ్లింప్స్, 'హంగ్రీ చీతా' పాట నుంచి మొదలు పెడితే ఇటీవల విడుదలైన 'ఫైర్ స్ట్రోమ్' సాంగ్ వరకు సిల్వర్ స్క్రీన్ మీద భారీ యాక్షన్ సినిమాను చూడటం గ్యారెంటీ అని అంచనాలు పెంచాయి. అయితే ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సినిమాలో ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ కంటెంట్ ఉందని చెప్పకనే చెప్పిందీ లుక్. త్వరలో ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ప్రోమో విడుదల చేస్తామని తెలిపారు.
Also Read: 'కూలీ'లో నాగార్జునకు డూప్... అతని పేరేంటో తెలుసా? ఎవరో తెలుసా?
సెప్టెంబర్ 25న 'ఓజీ' సినిమా విడుదల!పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు... పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ లవర్స్ అందరూ 'ఓజీ' విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుందీ సినిమా.
OG Movie Cast And Crew: పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్. ఇంకా అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్ ఎస్, ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్ - మనోజ్ పరమహంస, కూర్పు: నవీన్ నూలి, నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత: డీవీవీ దానయ్య - దాసరి కళ్యాణ్, దర్శకత్వం: సుజీత్.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?