Vishwak Sen Upcoming Movie Titled As Laila: యంగ్ హీరో విశ్వక్ సేన్.. ముందుగా ఆడియన్స్‌కు నచ్చే సినిమాలతో ఆకట్టుకొని అందరికీ దగ్గరయ్యాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ అయ్యింది. అందుకే ఇంక ప్రయోగాలకు సమయం వచ్చేసిందని అనుకుంటున్నాడో ఏమో.. కొత్త కొత్త కథలు, కథనాలతో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ‘గామి’ అనే ఒక ప్రయోగాత్మక చిత్రంతో వచ్చి పరవాలేదనిపించాడు విశ్వక్. ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అయ్యాడు. విశ్వక్ సేన్ అప్‌కమింగ్ మూవీకి సంబంధించిన టైటిల్.. తాజాగా విడుదలయ్యింది. దీనిని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు హీరో.


విశ్వక్ కెరీర్‌లో 12వ సినిమా..


కొన్నిరోజులుగా విశ్వక్ సేన్ అప్‌కమింగ్ మూవీపై పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. తన అప్‌కమింగ్ మూవీలో లేడీ గెటప్‌లో కనిపించనున్నాడని టాలీవుడ్ అంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఆ రూమర్స్ అన్ని నిజమే అనిపించేలా తాజాగా షైన్ స్క్రీన్స్ సంస్థ.. ఒక అప్డేట్‌ను విడుదల చేసింది. ముందుగా అతడు అని రాసున్నదాన్ని కొట్టేసి ఆమె ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం అని అప్డేట్ ఇచ్చింది. దీనిని విశ్వక్ సేన్ కెరీర్‌లో 12వ మూవీగా, వీఎస్ 12గా ప్రకటించింది. దీంతో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనున్నట్టుగా వస్తున్న రూమర్స్ నిజమే అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్.


ఆసక్తికరమైన వీడియో..


విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీ టైటిల్ ‘లైలా’ అని రివీల్ చేశారు మేకర్స్. దీనికోసం ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా విడుదల చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో చాలా బాగుందంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో అంతా పింక్ కలర్‌లో నిండిపోయింది. లిప్ స్టిక్, మేకప్ కిట్, అద్దం.. ఇలా అమ్మాయిలకు సంబంధించిన చాలా వస్తువులతో పాటు డంబెల్‌ను కూడా ఈ వీడియోలో హైలెట్ చేశారు. ఇక వీడియో మొత్తంలో ఒక మేక తల నరికేస్తున్న ఫోటోను కూడా పెట్టారు. చివర్లో గన్‌లో నుండి బులెట్‌కు బదులుగా లిప్ స్టిక్ వస్తున్నట్టుగా చూపించారు. దీంతో అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటో అర్థం కావడం లేదే అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కొందరైతే ‘‘సార్ మీరు మేడమా?’’ అంటూ చిలిపి ప్రశ్నలు వేస్తున్నారు.






బాలీవుడ్ బ్యూటీతో జోడీ..


‘లైలా’లో విశ్వక్ సేన్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆకాంక్ష శర్మ నటించుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలోనే ప్రకటించారు మేకర్స్. యంగ్ డైరెక్టర్ రామ్ నారాయణ్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. బాలీవుడ్‌లో స్టార్లకు మ్యూజికల్ హిట్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్చీ.. ‘లైలా’తో టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఇక విశ్వక్ సేన్.. ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మే 17న రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత ‘లైలా’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు విశ్వక్.


Also Read: విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్