మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari Movie). 'ఫలక్‌నుమా దాస్', 'ఈ నగరానికి ఏమైంది' సహా కొన్ని సినిమాల్లో తెలంగాణ యాసతో తనదైన నటనతో ఆకట్టుకున్న విశ్వక్... ఈ సినిమాలో గోదావరి యాసలో డైలాగులు చెప్పనున్నారు. మే 17న థియేటర్లలోకి సినిమా రానుంది. మరి, టీజర్? ఈ రోజు ఆ టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.


ఏప్రిల్ 27న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్
Gangs Of Godavari Teaser Release Date: ఏప్రిల్ 27... ఈ శనివారం సాయంత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో లంక రత్న పాత్రలో విశ్వక్ సేన్ నటిస్తున్నట్లు తెలిపింది.


Also Read: 'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా






Gangs Of Godavari Movie Producers: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ సంస్థలు తెరకెక్కిస్తున్నాయి. కృష్ణ చైతన్య దర్శకుడు. పాటల రచయితగా పలు సినిమాల్లో తన ప్రతిభతో ఆకట్టుకున్న ఆయన... 'రౌడీ ఫెలో', 'చల్ మోహన్ రంగ' తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి సహ నిర్మాతలు.


Also Readరెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!



విశ్వక్ సేన్ జోడీగా నేహా శెట్టి!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో విశ్వక్ సేన్ సరసన 'డీజే టిల్లు', 'బెదురు లంక 2012' సినిమాల ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయికగా నటించారు. తెలుగు అమ్మాయి అంజలి కీలక పాత్ర పోషించారు. గోదావరి జిల్లాలలోని మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. గోదారి చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన గ్యాంగ్ స్టర్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు.


'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. విశ్వక్ సేన్, నేహా శెట్టి మీద గోదావరిలో తెరకెక్కించిన 'సుట్టంలా సూసి పోకలా' మెలోడీ 50 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఇటీవల 'మోత మోగిపోద్ది' సాంగ్ విడుదల చేశారు. ఆ పాటకూ మంచి స్పందన లభిస్తోంది. అందులో హిందీ 'బిగ్ బాస్', 'ఓం భీమ్ బుష్' ఫేమ్ ఆయేషా ఖాన్ సందడి చేశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అనిత్ మధాడి, ప్రొడక్షన్ డిజైన్‌: గాంధీ నడికుడికర్, కూర్పు: జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి, యాక్షన్: పృథ్వీ.


Also Read'మంజుమ్మెల్ బాయ్స్' నటుడితో హీరోయిన్ పెళ్లి - హల్దీ వేడుకలో అపర్ణా దాస్ సందడి