Manjummel Boys actor Deepak Parambol to marry actress Aparna Das on April 24th: మలయాళ, తమిళ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అపర్ణా దాస్. 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడు దీపక్ పరంబోల్‌తో మరికొన్ని గంటల్లో ఆవిడ ఏడు అడుగులు వేయనున్నారు. పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలు కానున్నారు.
అపర్ణా దాస్ వెడ్స్ దీపక్ పరంబోల్
Aparna Das Weds Deepak Parambol: మలయాళ సినిమా 'మనోహరం'తో అపర్ణా దాస్ కథానాయికగా పరిచయం అయ్యారు. అంతకు ముందు ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన 'న్యాన్ ప్రకాశన్'లో చిన్న పాత్ర చేశారు. అయితే... ఆవిడను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది మాత్రం దళపతి విజయ్ 'బీస్ట్' చిత్రమే. అందులో కీ రోల్ చేశారు. తమిళ సినిమా 'దాదా' ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' సినిమాలో హీరోకి అక్క పాత్ర కూడా చేశారు.
మలయాళంలో పలు సినిమాల్లో కీలక పాత్రలు, కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన దీపక్ పరంబోల్ (Deepak Parambol Wedding)తో అపర్ణా దాస్ 'మనోహరం'లో కలిసి నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసిందని మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!
పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరుగుతోంది?
దీపక్ పరంబోల్, అపర్ణా దాస్ పెళ్లి గురువారం (ఏప్రిల్ 24న) ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య జరగనుంది. అందుకు పెళ్లి వేదిక కూడా సిద్ధమైంది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో గల వడక్కెంచెర్రీ పట్టణంలో జరుగుతుంది. ఈ పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది బంధు మిత్రులు మాత్రమే హాజరు కానున్నారు.
Also Read: బీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్... ఎర్త్ డే రోజున చెన్నైలో ఓ అందాల భామ ఏం చేసిందో చూశారా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హల్దీ ఫోటోలు
పెళ్లికి ముందు పసుపు వేడుక జరగడం కామన్ కదా! సోమవారం హల్దీ సెర్మనీ జరిగింది. ఆ వీడియోతో పాటు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అపర్ణా దాస్. ప్రజెంట్ ఎక్కడ చూసినా ఆమె పెళ్లి కబుర్లే. హల్దీ వేడుకలో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న అపర్ణా దాస్ ఫోటోలు, వీడియో వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత కూడా కథానాయికగా సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు ఆమె చెప్పారు. ఓ మలయాళ సినిమాలో ప్రజెంట్ నటిస్తున్నారు.
Also Read: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?