విష్ణు మంచు (Vishnu Manchu) ముందు సన్నీ లియోన్ పప్పులు ఉడకలేదు. ఆమె అనుకున్నది ఒక్కటి అయితే... జరిగింది మరొకటి! విష్ణును భయపెట్టాలని సన్నీ లియోన్ అనుకుంటే, ఆమెను అతడు సరదాగా ఆటపట్టించారు విష్ణు. ఇంతకీ, ఏం జరిగిందంటే... సన్నీ లియోన్ (Sunny Leone Latest Instagram Post) లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఒకసారి చూడాల్సిందే.
మంచు విష్ణు కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా 'గాలి నాగేశ్వరరావు'. ఇందులో శృంగార తార సన్నీ లియోన్ (Sunny Leone) ఓ కథానాయిక (పాయల్ రాజ్ పుత్ మరో కథానాయిక) గా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చేసేటప్పుడు విష్ణును భయపెట్టాలని సన్నీ లియోన్ ప్రయత్నించారు. ముఖానికి మాస్క్ ధరించి... 'భూ' అంటూ ఒక్కసారి ముందుకు వచ్చారు. అతడు భయపడలేదు సరి కదా... మాస్క్ తీసిన తర్వాత సున్నీ లియోన్ పేస్ చూసి భయపడినట్టు నటించారు. సరదాగా ఆమెను ఆటపట్టించారు. తనను చూసి భయపడినట్టు విష్ణు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడంతో అతడిని కొట్టడానికి అన్నట్టు ఆమె పరుగులు తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ (Vishnu Manchu Sunny Leone Viral Video) అవుతోంది.
Also Read: 'గని' సినిమా రివ్యూ: బాక్సింగ్ పంచ్ అదిరిందా? లేదా?
'గాలి నాగేశ్వరరావు'లో సన్నీ లియోన్ రేణుక పాత్ర చేస్తున్నారు. కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి జి. నాగేశ్వరరరెడ్డి మూల కథ అందించగా... కథ, స్క్రీన్ ప్లే కోన వెంకట్ అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు, మాటలు: నందు - భాను, సంగీతం: అనూప్ రూబెన్స్.
Also Read: 'కథ కంచికి మనం ఇంటికి' రివ్యూ: 'చీకటి గదిలో చితకొట్టుడు'తో త్రిగుణ్ మీద పడిన మచ్చ పోతుందా?