ఫ్యామిలీతో చూసే సినిమాలు కొన్ని ఉంటే... స్నేహితులతో కలిసి చూసే ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి. యూత్ చూసే మూవీస్ కొన్ని ఉంటాయి. 'వర్జిన్ బాయ్స్' (Virgin Boys Movie) అయితే యూత్ చూసే సినిమా అని చెప్పాలి.
యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ!గీతానంద్, మిత్రా శర్మ (Mitraaw Sharma) హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'వర్జిన్ బాయ్స్'. ఇందులో శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షులా, సుజిత్ కుమార్, అభిలాష్ ఇతర ప్రధాన తారాగణం. ఇదొక యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ. ఈ సినిమాకు దయానంద్ దర్శకత్వం వహించారు. రాజ్ గురు ఫిల్మ్స్ పతాకం మీద రాజా దరపునేని ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'వర్జిన్ బాయ్స్'ను తీసినట్టు టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది. రొమాన్స్ అండ్ అడల్ట్ కామెడీని గట్టిగా దట్టించారు. స్మరణ్ సాయి సంగీతం టీజర్‌లో జోష్ పెంచగా... వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది. గీతానంద్, మిత్రా శర్మ మధ్య కెమిస్ట్రీ యూత్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
Also Read: యాంగ్రీ మ్యాన్‌తో విజయ్ దేవరకొండ 'ఢీ'... యంగ్ డైరెక్టర్ క్రేజీ ప్లాన్... విలన్ రోల్ కన్ఫర్మ్
మోడ్రన్, న్యూ ఏజ్ కాలేజీ లైఫ్ - యూత్ లైఫ్ స్టైల్ చూపించే సినిమా అని అర్థం అవుతోంది. 'బిగ్ బాస్' ఫేమ్ శ్రీహాన్ క్యారెక్టర్ - కామెడీ టైమింగ్ జనాలకు నచ్చేలా ఉంది. వేసవిలో 'వర్జిన్ బాయ్స్'ను థియేటర్లలోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: పాపం నితిన్... దేవరకొండ కోసం త్యాగం చేయక తప్పలేదు... తమ్ముడిని వెనక్కి పంపిన 'దిల్' రాజు
'వర్జిన్ బాయ్స్' నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ... ''యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలా మా సినిమాను తీర్చిదిద్దాం. గతంలో వచ్చిన యూత్ ఫుల్ సినిమాలకు భిన్నంగా కొత్త కథతో ఈ సినిమా తీశాం. రొటీన్ మూవీ అన్నట్టు కాకుండా మిగతా సినిమాలకు భిన్నంగా ఉంటుందీ సినిమా'' అని చెప్పారు.