పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు ఒక గుడ్ న్యూస్. ఆయన నేతృత్వంలోని జనసేన పార్టీ గడిచిన ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, తమ అభిమాన కథానాయకుడు ఏపీ డిప్యూటీ సీఎం కావడం వాళ్లకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. రాజకీయాలతో పాటు సినిమాలలోనూ ఆయన జోరు చూపించాలని కోరుకునే ప్రేక్షకులు తక్కువ ఏమీ కాదు. వాళ్ల కోసం ఆల్రెడీ అంగీకరించిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్.
ఓజీ... సెట్స్‌కు పవన్ వచ్చారు జీ!ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' (OG Movie - They Call Him OG) ఒకటి. అందులో ఓజాస్ గంభీర పాత్రలో పవర్ స్టార్ కనిపించనున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, వాటిలో పవన్ కళ్యాణ్ స్వాగ్ అండ్ స్టైల్ అభిమానులను ఫుల్ ఖుషి చేశాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... పవన్ కళ్యాణ్ మళ్లీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు.
''The #OG steps into his arena. Pawan Kalyan back on OG sets'' అని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పేర్కొంది. రెండు మూడు వారాల పాటు పవన్ కళ్యాణ్ సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు.
Also Read: యాంగ్రీ మ్యాన్‌తో విజయ్ దేవరకొండ 'ఢీ'... యంగ్ డైరెక్టర్ క్రేజీ ప్లాన్... విలన్ రోల్ కన్ఫర్మ్
'ఓజీ' చిత్రీకరణలో నటి శ్రియా రెడ్డి!కథానాయికగా కొన్ని సినిమాలు చేయడంతో పాటు ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రియా రెడ్డి గుర్తు ఉన్నారు కదా! ఆవిడ 'ఓజీ' సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తాను 'ఓజీ' చిత్రీకరణ చేస్తున్నట్లు ఆవిడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ''మళ్లీ మొదలైంది... ఈసారి ముగిద్దాం'' అని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పేర్కొంది.
'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ మీద డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. 'హరిహర వీరమల్లు' తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు.