'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్‌డమ్' జూలై 4న విడుదల కానుంది. ఆ తర్వాత? రౌడీ బాయ్ చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో 'రౌడీ జనార్ధన్' (Rowdy Janardhan) ఒకటి. ఆ సినిమాలో విలన్ రోల్ సీనియర్ హీరో చేయనున్నట్లు తెలిసింది.
యాంగ్రీ మ్యాన్‌తో రౌడీ బాయ్ 'ఢీ''రౌడీ జనార్ధన్'లో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Rajasekhar)తో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఢీ కొట్టబోతున్నారట. ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఇద్దరి క్యారెక్టర్స్ ఉంటాయట.
'రౌడీ జనార్ధన్' సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయవలసిందిగా రాజశేఖర్‌ను దర్శక నిర్మాతలు సంప్రదించారు. ఇటీవల ఆయన మీద ఒక ఫోటో షూట్ కూడా చేశారు. గోదావరి నేపథ్యంలో రౌడీలు, అక్కడి పగ ప్రతీకారాలు నేపథ్యంలో యువ దర్శకుడు రవి కిరణ్ కోలా (రాజా వారు రాణి గారు ఫేమ్) ఈ సినిమా కథ రాశారు. ఇందులో హీరోకి ధీటుగా విలన్ క్యారెక్టర్ కూడా డిజైన్ చేశారట. ఆ పాత్రలో రాజశేఖర్ నటిస్తే బాగుంటుందని ఆయన అనుకోవడం, వెంటనే సంప్రదించడం జరిగాయి.
'రౌడీ జనార్ధన్'లో విలన్ క్యారెక్టర్ లుక్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు సంథింగ్ డిఫరెంట్ అనేలా డిజైన్ చేయడంతో అందులో రాజశేఖర్ ఎలా ఉంటారో చూసుకోవడం కోసం ఇటీవల లుక్ టెస్ట్ చేశారు. ఆయన విలన్ రోల్ చేయడం 99.99 శాతం కన్ఫర్మ్. త్వరలో దీనికి సంబంధించిన పూర్తిగా వివరాలు వెల్లడించనున్నారు. నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డనరీ మ్యాన్'లో రాజశేఖర్ కీలక పాత్ర చేశారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ సినిమా యాక్షన్ డ్రామా కావడంతో సెకండ్ ఇన్నింగ్స్ బావుంటుందని ఆశించవచ్చు.
కత్తి నేనే... నెత్తురు నాదే... యుద్ధం నాతోనేహీరోగా విజయ్ దేవరకొండ 15వ సినిమా 'రౌడీ జనార్ధన్'. ఆల్రెడీ ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్, సినిమా ప్రీ లుక్ విడుదల చేశారు. 'కత్తి నేనే... నెత్తురు నేనే... యుద్ధం నాతోనే' అంటూ ఇచ్చిన క్యాప్షన్ అంచనాల పెంచింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద అగ్ర నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.