లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ (Ram Charan) తన మైనపు విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించిన సంగతి తెలిసింది. ఆ తర్వాత అక్కడ అభిమానులతో సమావేశం అయ్యారు. ఫ్యాన్స్ మీట్‌లో తన తాజా సినిమా 'పెద్ది' (Peddi Movie) గురించి రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. 

ఇది రాసి పెట్టుకోండి...ఇలా ప్రతి సినిమాకు చెప్పను!Ram Charan speech at London Fans Meet: 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాల కంటే 'పెద్ది' సినిమా షూటింగ్ చేసేటప్పుడు చాలా ఎగ్జైట్ అవుతున్నట్టు రామ్ చరణ్ తెలిపారు. మామూలుగా ప్రతి సినిమాకు తాను ఇలా చెప్పననీ, కానీ ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అనీ, ఈ సినిమా గురించి రాసి పెట్టుకోండి ‌అని రామ్ చరణ్ చెప్పారు.

Also Read: థగ్ లైఫ్, వీరమల్లు నుంచి కుబేర, కన్నప్ప వరకూ... జూన్‌లో పాన్ ఇండియా ఫిలిమ్స్ సందడి - టాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు

షూటింగ్ 30 శాతమే‌...ఇంకా 70 శాతం‌ కావాలి!Peddi Movie Shooting Update: 'పెద్ది' చిత్రీకరణ 30 శాతం పూర్తి అయ్యిందని రామ్ చరణ్ తెలిపారు. ఇప్పటి‌ వరకు జరిగిన చిత్రీకరణ పట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని, ఇంకా 70 శాతం‌ చిత్రీకరణ చేయాల్సి ఉందని‌ ఆయన వివరించారు. సినిమా భారీ ఎత్తున ఉంటుందని చెప్పారు.

Also Readఇండియన్ 2 ఫ్లాపైనా కమల్ క్రేజ్ తగ్గలే... నాన్ థియేట్రికల్ రైట్స్‌తో నిర్మాతల జేబులో 200 కోట్లు

చరణ్ పుట్టిన రోజుకు...థియేటర్లలోకి సినిమా!'పెద్ది' చిత్రానికి సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు జగపతిబాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ‌సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం మీద వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ రిలీజైన వీడియో గ్లింప్స్‌కు ఆయన ఇచ్చిన మ్యూజిక్ అంచనాలు పెంచింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.