ఇవాళ్టి సినిమా వార్తల్లో 'ది' విజయ్ దేవరకొండ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్‌డమ్' (Kingdom) విడుదల వాయిదా పడిందనేది ఒకటి. మే 30న విడుదల కావాల్సిన సినిమా జూలై 4వ తేదీకి వెళ్ళింది. దీని వెనక నితిన్ త్యాగం ఉందని తెలుసా? పాపం... ఆ రోజు విడుదల కావాల్సిన మరో సినిమా వెనక్కి వెళ్లిందని తెలుసా?
'తమ్ముడు' త్యాగం చేశాడు...విజయ్ దేవరకొండ వస్తున్నాడు!'కింగ్‌డమ్' విడుదల వాయిదా పడిన సంగతి చెబుతూ నిర్మాతలు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అందులో ''విడుదల తేదీ మార్పు విషయంలో మాకు సహకరించిన నిర్మాత దిల్ రాజు హీరో నితిన్ గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. ఎందుకో తెలుసా?
విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్'ను నైజాంలో 'దిల్' రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే, నితిన్ 'తమ్ముడు'కు ఆయన నిర్మాత. సో... సొంత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ద్వారా సినిమాను విడుదల చేస్తారు. 'కింగ్‌డమ్', 'తమ్ముడు' సినిమాలు ఒకే రోజు విడుదల కావడం వల్ల వసూళ్లను పంచుకోవలసి వస్తుంది. పంపిణీదారుడిగా 'దిల్' రాజు కొంత నష్టాలు భరించాల్సి వస్తుంది. అందుకని విజయ్ దేవరకొండ సినిమా కోసం నితిన్ హీరోగా తాను నిర్మిస్తున్న సినిమా వాయిదా వేశారు. దాంతో నితిన్ త్యాగం చేయక తప్పలేదు.
Also Read: యాంగ్రీ మ్యాన్‌తో విజయ్ దేవరకొండ 'ఢీ'... యంగ్ డైరెక్టర్ క్రేజీ ప్లాన్... విలన్ రోల్ కన్ఫర్మ్
నితిన్ కథానాయకుడిగా నటించిన లాస్ట్ సినిమా 'రాబిన్‌హుడ్' రిజల్ట్ అసలు బాలేదు. డిజాస్టర్ అయ్యింది. 'తమ్ముడు' సినిమా మీద అనుకున్నంత స్థాయిలో బజ్ జనరేట్ కాలేదు. దాంతో సినిమా విడుదల వాయిదా వేయడం మంచిదని డిసైడ్ అయ్యారట. మరో విషయం ఏమిటంటే... ఈ రెండు సినిమాలకు ఓటీటీ పార్టనర్ ఒక్కటే, నెట్‌ఫ్లిక్స్. 'కింగ్‌డమ్' విడుదల వాయిదాకు నెట్‌ఫ్లిక్స్ ఓకే చెప్పిందట. అంటే... ఇటీవల థియేట్రికల్ రిలీజ్ మీద ఓటీటీల ఎఫెక్ట్ ఉంటోంది. అందువల్ల, 'తమ్ముడు'ను నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడు విడుదల చేయమంటుందో? వెయిట్ అండ్ సి.