ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కథానాయకుడిగా 'బన్నీ' వాసు నిర్మిస్తున్న సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ' (Vinaro Bhagyamu Vishnu Katha Movie). శ్రీరామ నవమి సందర్భంగా (Sri Rama Navami 2022 Special) ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

 

'వినరో భాగ్యము విష్ణు కథ' ఫస్ట్ లుక్ చూస్తే... వెనుక దేవాలయం, ముందు బసవన్నతో కిరణ్ అబ్బవరం - పండుగ సమయంలో వచ్చే సన్నివేశంలో స్టిల్ టైపులో ఉంది. ఫెస్టివల్ మూడ్ కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరం చేతిలో బూర చూస్తుంటే... బసవన్నలతో ఇంటింటికీ వచ్చే మనిషి పాత్ర (Kiran Abbavaram Role In Vinaro Bhagyamu Vishnu Katha) పోషిస్తున్నట్టు అనిపిస్తోంది. అది నిజమో? కాదో? యూనిట్ చెప్పాలి. 

 






Vinaro Bhagyamu Vishnu Katha Movie Update: కిర‌ణ్ అబ్బ‌వ‌రం సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ (Kashmira Pardeshi) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాతో మురళీ కిశోర్ అబ్బురు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. గత నెలలో తిరుపతిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు: స‌త్య‌ గమిడి - శ‌రత్ చంద్ర నాయుడు, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియ‌ల్, స‌హ నిర్మాత‌: బాబు, సంగీతం: చైత‌న్ భరద్వాజ్.