Thangalaan Movie First Review :'కబాలి', 'సార్పట్టాస లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ పా. రంజిత్. 'అపరిచితుడు', 'ఐ', 'శివపుత్రుడు' లాంటి డిఫరెంట్ సినిమాలు తీసిన చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'తంగలాన్'. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కారణం దాంట్లో విక్రమ్ డిఫరెంట్ గా కనిపించనున్నారు. సినిమా రిలీజ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే, పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ తన రివ్యూ ఇచ్చేశారు. ఆయన ఏమన్నారంటే?
గెట్ రెడీ అంటూ ట్వీట్..
చియాన్ విక్రమ్ నటించిన ఈ సినిమాకి జీవి ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా.. ఆయన ఈ సినిమాకి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. సినిమా సూపర్ ఉందని, ఇండియన్ సినిమా గెట్ రెడీ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. "అద్భుతమైన సినిమా.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇప్పటికే పూర్తి చేశాను. త్వరలోనే మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ రాబోతుంది రెడీగా ఉండండి. ఇండియన్ సినిమా రికార్డులకు రెడీగా ఉండూ" అంటూ సినిమా అద్భుతంగా ఉందనే కాన్ఫిడెన్స్ ని ఇచ్చాడు జీవి ప్రకాశ్. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ట్రైలర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
డిఫరెంట్ క్యారెక్టర్లకు కేరాఫ్..
వైవిధ్యమైన క్యారెక్టర్లకు కేరాఫ్ చియాన్ విక్రమ్. ఇప్పటికే 'శివపుత్రుడు', 'అపరిచితుడు', 'ఐ' తదితర సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేసి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు విక్రమ్. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆయన లుక్ డిఫరెంట్ గానే ఉంది. ఇప్పటికే మేకింగ్ వీడియోను టీమ్ రిలీజ్ చేసింది. దాంట్లో విక్రమ్ ఈ క్యారెక్టర్ కోసం ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం అవుతుంది.
35 కేజీలు తగ్గిన విక్రమ్..
కోలార్ గోల్డ్ ఫైల్స్ నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. దీంట్లో విక్రమ్.. 'శివపుత్రుడు'లో కనిపించినట్లుగా ఉండబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం ఆయన ఏకంగా 35 కేజీలు బరువు తగ్గారు. అంతేకాదు ఈ సినిమాలో తనకు డైలాగ్స్ ఉండవని, శివపుత్రుడు సినిమాలో అరిచినట్లు ఇక్కడ కూడా అరుస్తానని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చాలా కష్టపడ్డానని, రోజంతా ఈ మేకప్ లో షూటింగ్ చేశానని చెప్పుకొచ్చారు విక్రమ్. బరువు తగ్గేందుకు విక్రమ్ చాలా కష్టపడ్డారని ఈ సినిమా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ చెప్పారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా కష్టపడ్డారని, చాలా హార్డ్ వర్క్ చేశారని అన్నారు. ఈ సినిమాలో ఓ సరికొత్త విక్రమ్ ను చూస్తారంటూ తెలిపారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన పార్వతి తిరువోతూ, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో పశుపతి, డానియల్, హరికృష్ణన్, అన్బుదురై ఇతర కీలక పాత్రలు పోషించారు.
Also Read: వెంకటేశ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఫిక్స్ - తాళి, గన్, గులాబీలతో క్రేజీ అప్‌డేట్!