Prabhas Assets And Net Worth: ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. అప్పటినుండి తన సినిమాలు అన్నీ వేరే లెవెల్‌లో ఉంటున్నాయి. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. అలా అప్పటినుండి ప్రభాస్ క్రేజ్‌తో పాటు రెమ్యునరేషన్ కూడా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ హీరో తీసుకోనంత రెమ్యునరేషన్‌ను అందుకుంటున్నారు ప్రభాస్. అలా తన సంపాదనతో తన దగ్గర ఉన్న కార్ కలెక్షన్స్‌తో పాటు ఆస్తులు కూడా పెంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ ఖాతాలో ఉన్న కార్ కలెక్షన్స్, ఆస్తుల వివరాలు ఏంటో మీరూ చూసేయండి.


ఇటలీలో విల్లా..


జూబ్లీ హిల్స్‌లో ప్రభాస్‌కు ఒక బంగ్లా ఉంది. ఆ బంగ్లా విలువ దాదాపు రూ.60 కోట్లు ఉండవచ్చని సమాచారం. అందులో ఒక గార్డెన్, జిమ్, స్విమ్మింగ్ పూల్‌తో పాటు మరెన్నో ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇండియాలో మాత్రమే కాకుండా ఇటలీలో కూడా ప్రభాస్ పేరున ఒక విల్లా ఉందట. ఆ విల్లాను టూరిస్టులకు రెంట్‌కు ఇస్తూ నెలకు దాదాపుగా రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడట ఈ స్టార్ హీరో. సినీ పరిశ్రమలో చాలామందికి ఒక ప్రైవేట్ జెట్ ఉంది. ఆ లిస్ట్‌లో ప్రభాస్ కూడా ఉన్నాడు. ప్రొఫెషనల్‌తో పాటు పర్సనల్ పనుల కోసం కూడా ఈ జెట్‌ను ఉపయోగిస్తుంటాడు ఈ పాన్ ఇండియా స్టార్.


కాస్ట్‌లీ కారు..


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆస్తుల విలువ దాదాపు 29 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో రూ.242 కోట్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ ఆస్తుల్లో తన లగ్జరీ కార్లు, వేర్వేరు ప్రాంతాల్లో సౌకర్యవంతమైన బంగ్లాలు కూడా ఉన్నాయి. ముందుగా ప్రభాస్ కార్ల కలెక్షన్స్ విషయానికొస్తే.. తనకు ఒక ‘రోల్స్ రాయిస్ ఫాంటమ్’ ఉంది. తనకు ఉన్న అన్ని కార్లలో దీని ధర చాలా ఎక్కువ. 2015లో ఈ కారును కొనుగోలు చేశారు ప్రభాస్. ఇండియన్ మార్కెట్‌లో దీని స్టార్టింగ్ ధర రూ.8.99 కోట్ల నుండి రూ.10.48 కోట్ల మధ్య ఉండవచ్చు. రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ను కొనుగోలు చేయడంతో పాటు తనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకున్నాడు ఈ హీరో.


మరెన్నో లగ్జరీ కార్లు..


ప్రభాస్ కార్ కలెక్షన్స్‌తో మరొక కాస్ట్‌లీ కారు ‘లంబోర్ఘిని ఆవెంటేడర్ రోడ్‌స్టర్’. 2021లో తను కొనుగోలు చేసిన ఈ కారు ధర రూ.6 కోట్లు. ఇటలీలో తయారు చేసిన ఈ కారు 6.5 లీటర్ V-12 ఇంజన్‌తో రన్ అవుతుంది. ఇది స్టార్ట్ చేసిన 3 సెకండ్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. 9 సెకండ్లలో గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని కూడా టచ్ చేయగలదు. దీంతో పాటు ప్రభాస్‌కు రూ.2.39 కోట్లు విలువ చేసే ‘ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్’ ఉంది. అంతే కాకుండా రూ.68 లక్షలు విలువ చేసే ‘బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3’, రూ. 2.08 కోట్లు విలువ చేసే ‘జాగ్వార్ ఎక్స్‌జేఆర్’ కూడా ఉన్నాయి.



Also Read: కొడుకుతో క‌లిసి 'క‌ల్కీ 2898 ఏడీ' చూసిన అమితాబ్ - అభిషేక్ బ‌చ్చ‌న్ రివ్యూ ఏంటంటే?