Vijayendra Prasad: పవన్‌తో కలిసి ఎవరూ చేయలేరు, ఆయన రేంజ్ స్టార్ ఎవరూ లేరు - రాజమౌళితో సినిమాపై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

Vijayendra Prasad: పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని విజయేంద్ర ప్రసాద్ పలుమార్లు బయటపెట్టారు. కానీ అదే విషయంపై తాజాగా ఆయన మరెన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

Vijayendra Prasad about Pawan Kalyan: దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమా ప్రమోషన్స్ సమయంలో తప్పా మిగతా సమయాల్లో పెద్దగా మీడియా ముందుకు రారు. ఎక్కువగా ఇంటర్వ్యూలలో పాల్గొనరు. కానీ ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం అలా కాదు.. ఎప్పటికప్పుడు ఇంటర్య్యూలలో పాల్గొంటూ రాజమౌళి అప్‌కమింగ్ సినిమాల గురించి, ప్లాన్స్ గురించి, స్క్రిప్ట్ వరకు గురించి.. ఇలా అన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్‌తో మూవీ గురించి కూడా మాట్లాడారు.

Continues below advertisement

ఆ ఆలోచన రాలేదు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విజయేంద్ర ప్రసాద్‌కు చాలా అభిమానం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలాసార్లు బయటపెట్టారు. కానీ రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మాత్రం ఆయన సెట్ చేయలేకపోయారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆ కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వడం లేదని ఆయనకు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘సమయం, సందర్భం రావాలి కదా. నిర్మాతలు ఎవరూ పవన్ కళ్యాణ్ డేట్స్‌తో రాలేదు. బాహుబలి వరకు వేరే హీరోల డేట్స్‌తోనే వచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్‌తో ఇంకొక స్టార్‌ను పెట్టి సినిమా తీద్దామన్నా.. ఆయనతో ఎవరూ చేయలేరు. ఆయన సూపర్ డూపర్ మెగాస్టార్. ఆయన రేంజ్ స్టార్ ఎవరూ లేరు కలవడానికి. అందుకే ఆ ఆలోచన రాలేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు విజయేంద్ర ప్రసాద్. 

పదేళ్ల క్రితం..

‘‘మహేశ్ బాబుతో చేయాలని కమిట్మెంట్ ఉంది. పదేళ్ల క్రితం అనుకున్న కాంబినేషన్ ఇది. దీని తర్వాత పవన్ కళ్యాణ్‌తో వస్తుందేమో’’ అని బయటపెట్టారు విజయేంద్ర ప్రసాద్. పదేళ్ల క్రితం అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు అవుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ‘బాహుబలి’ అనుకోకుండా రెండు పార్ట్స్ అయ్యిందని, కరోనా వల్ల కూడా లేట్ అయ్యిందని తెలిపారు. రాజమౌళి మాత్రమే కాకుండా విజయేంద్ర ప్రసాద్ కూడా డైరెక్టర్‌గా పలు సినిమాలు చేశారు. త్వరలోనే మళ్లీ డైరెక్షన్ చేస్తానని కూడా ప్రకటించారు. అందులో చాలామంది యాక్టర్లు ఉంటారని కూడా అన్నారు. అంతకు మించి ఆయన డైరెక్షన్ చేసే ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే రివీల్ చేయడానికి ఇష్టపడలేదు విజయేంద్ర ప్రసాద్.

ఒక్కసారిగా జరిగింది కాదు..

అసలు పవన్ కళ్యాణ్‌లో ఏం ఇష్టం అని అడగగా.. ‘‘ఆయన సినిమాల్లో నటన ఇష్టం. బయట సూటిగా మాట్లాడడం ఇష్టం, నిజాయితీ ఇష్టం. అలా ఆయనలో అన్ని ఇష్టం. సమయం గడుస్తున్నాకొద్దీ ఇష్టం అనేది పెరుగుతుంది. ఒక్కసారిగా జరిగిపోయేది కాదు’’ అని బయటపెట్టాడు విజయేంద్ర ప్రసాద్. ఇక పవన్ కళ్యాణ్‌తో మొదటి పరిచయాన్ని కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఒక యోగా కార్యక్రమానికి వెళ్లినప్పుడు తన స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ను పరిచయం చేశారని, కానీ ఆయనను గుర్తుపట్టకుండా ఎవరు అని అడిగానని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. ‘‘అప్పటికీ ఆయన 2,3 సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ఆయనను గుర్తుపట్టలేకపోవడం నా తెలివితక్కువతనం. అక్కడ ఆయన అలా ఉంటాడని ఊహించం’’ అని తెలిపారు.

Also Read: భర్తతో నయన్ విడాకుల రూమర్స్ - ఆ ఒక్క స్టోరీతో క్లారిటీ ఇచ్చిన విఘ్నేష్

Continues below advertisement
Sponsored Links by Taboola