Nayanthara: భర్తతో నయన్ విడాకుల రూమర్స్ - ఆ ఒక్క స్టోరీతో క్లారిటీ ఇచ్చిన విఘ్నేష్

Nayanthara and Vignesh Shivan: నయనతార.. తన భర్త విఘ్నేష్ శివన్‌కు విడాకులు ఇవ్వనుందని రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో నయన్.. విక్కీని ఫాలో అవుతున్నట్టు కనిపించకపోవడమే దీనికి కారణం.

Continues below advertisement

Nayanthara and Vignesh Shivan Divorce Rumors: సినీ సెలబ్రిటీల పెళ్లి జరిగి కొన్ని సంవత్సరాలు గడిచిందంటే చాలు.. ఆధారాలు ఉన్నా లేకపోయినా.. ఆ జంట విడాకులు తీసుకుంటుందని రూమర్స్ మొదలవుతాయి. చాలాసార్లు ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని తేలిపోతుంది. వారిపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇవ్వడానికి కొన్ని జంటలు ముందుకొస్తున్నాయి. కొన్ని జంటలు మాత్రం మనకెందుకులే అని సైలెంట్‌గా ఉండిపోతాయి. తాజాగా కోలీవుడ్ క్యూట్ కపుల్ అయిన విఘ్నేష్ శివన్, నయనతారపై కూడా ఇలాంటి విడాకుల రూమర్సే వైరల్ అయ్యాయి. దీంతో వీటిపై క్లారిటీ ఇవ్వడానికి విఘ్నేష్ ముందుకొచ్చాడు.

Continues below advertisement

ఎప్పుడూ సపోర్ట్‌గా..

ఎన్నో ఏళ్లుగా ఎందరో స్టార్లతో సినిమాలు చేసి.. సౌత్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. సినిమాల్లో తనలాగా అనుభవం లేకపోయినా కూడా దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి సన్నిహితుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. ఇక పెళ్లయిన కొన్ని నెలలకే వీరిద్దరూ కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారని ప్రకటించారు. ఇక వీరు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. విఘ్నేష్ శివన్.. తనను పర్సనల్ లైఫ్‌లోనే కాదు.. కెరీర్ పరంగా కూడా ఎలా సపోర్ట్ చేస్తాడో పలుమార్లు బయటపెట్టింది నయన్. అలాంటిది వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని కొన్నిరోజులుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

అన్‌ఫాలో చేసిందంటూ మొదలు..

ఎన్ని సినిమాల్లో నటించినా.. ఎంత స్టార్‌డమ్ వచ్చినా.. నయనతార మాత్రం సోషల్ మీడియాకు దూరంగానే ఉండేది. కానీ కొన్నిరోజుల కిత్రం తాను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టింది. ఇక ఇటీవల నయనతార ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫాలోయింగ్ లిస్ట్‌లో విఘ్నేష్ శివన్ పేరు కనిపించలేదు. దీంతో నయన్.. విఘ్నేష్‌ను అన్‌ఫాలో చేసిందని వార్తలు మొదలయ్యాయి. అంతే కాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వింత కోట్‌ను కూడా షేర్ చేసింది. దీంతో ఇవన్నీ చూస్తుంటే.. నయన్, విఘ్నేష్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, త్వరలోనే వారు విడాకులు కూడా తీసుకోనున్నారని కొందరు నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.

ఆ పోస్ట్‌తో క్లారిటీ..

తాజాగా విఘ్నేష్ శివన్ చేసిన ఒక పోస్ట్.. ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టింది. నయనతార కొన్నిరోజుల క్రితం ఒక స్కిన్ కేర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. తాజాగా ఆ బ్రాండ్‌కు ఒక అవార్డ్ దక్కిందని విఘ్నేష్ శివన్.. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. నయనతార ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో చిన్న టెక్నికల్ సమస్య వల్లే విఘ్నేష్ పేరు ఫాలోయింగ్ లిస్ట్‌లో కనిపించలేదని సన్నిహితులు చెప్తున్నారు. దీంతో రెండురోజుల నుండి కోలీవుడ్‌లో మాత్రమే కాదు.. టాలీవుడ్ ‌లో కూడా వైరల్ అవుతున్న విఘ్నేష్, నయనతార విడాకుల రూమర్స్‌కు చెక్ పడింది. ఇక సినిమాల విషయానికొస్తే.. విఘ్నేష్ ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఒక యూత్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.

Also Read: 'గామి' సినిమా కోసం జీరో రెమ్యునరేషన్, మైనస్ 30 డిగ్రీల్లో షూటింగ్ - ఆసక్తికర విషయాలు వెల్లడించిన విశ్వక్ సేన్

Continues below advertisement
Sponsored Links by Taboola