Vijayashanti Appreciates Kalyan Ram And Mahesh Babu: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ స్టోరీ వినగానే ఏదో తెలియని అనుభూతి కలిగిందని.. తప్పకుండా సినిమా చేయాలనిపించినట్లు సీనియర్ నటి విజయశాంతి అన్నారు. మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఈ సినిమాలో తాను యాక్షన్ సీక్వెన్స్ కోసం వర్క్ చేసినట్లు చెప్పారు. సింగిల్ షాట్‌లోనే ఫైట్ సీన్స్ చేసినట్లు తెలిపారు.


'ఆ ఇద్దరూ మంచి బాలురు'


విజయశాంతి (Vijayashanti) మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'తో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'లో కనిపించబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె.. మహేష్ బాబు, కల్యాణ్ రామ్‌లపై ప్రశంసలు కురిపించారు. ఇద్దరూ మంచి హీరోలని.. మంచి మనసున్న వారంటూ కొనియాడారు. 'ఒకరు సూపర్ స్టార్ కృష్ణ కొడుకు, ఇంకొకరు ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ గారి అబ్బాయి. ఇద్దరికీ విజయం సాధించాలనే కసి ఉంది. నిర్మాతలు, ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా బెస్ట్ ఇవ్వాలనే తపనతో పని చేస్తారు.' అని ప్రశంసించారు.



Also Read: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ సంబరాలు


అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ.. తగ్గేదేలే..


తాను ఈ  సినిమాలో యాక్షన్ సీన్స్ చేశానని.. ఇది తన అభిమానులకు తప్పకుండా నచ్చుతుందని విజయశాంతి అన్నారు. 'యాక్షన్ సీన్స్ అని చెప్పగానే కాస్త సవాల్‌గా అనిపించింది. షూట్ రోజు సెట్‌లో ఉన్న వాళ్లందరూ ఎంతో కంగారుపడ్డారు. కానీ.. ఫస్ట్ షాట్‌లోనే సీన్ పూర్తి చేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు విజయశాంతినే. అదే పౌరుషం.. అదే రోషం.. తగ్గేదేలే. ఎంత వయసొచ్చినా అంతే స్ట్రాంగ్, క్రమశిక్షణతో ఉంటాను. నా తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచడం వల్లే మీ అందరి ఆశీస్సులు పొంది ఈ స్థాయికి వచ్చాను.' అని తెలిపారు.


సినిమా రిలీజ్.. ఆ మొక్కేంటో తెలుసా..?


ఈవెంట్‌లో విజయశాంతి, కల్యాణ్ రామ్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత చేపల పులుసు పంపిస్తానని కల్యాణ్ రామ్ అనగా.. కాలినడకన తిరుపతి దర్శనం తర్వాత నాన్ వెజ్ తినకూడదని.. ఆ తర్వాత పంపించాలంటూ సరదాగా కామెంట్ చేశారు. మీరు ఎప్పుడు పంపమంటే అప్పుడు పంపిస్తానని అన్నారు. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు విజయశాంతి అమ్మ మొక్కుకున్నారని అందుకే నాన్ వెజ్ తినలేదని కల్యాణ్ రామ్ చెప్పారు. అంతకు ముందు తనను 'గారు' అంటూ అనొద్దని అనగా.. రామ్ అని పిలుస్తానంటూ విజయశాంతి అన్నారు.


'బిగ్గెస్ పిల్లర్ అమ్మ'


ఈ సినిమాకు బిగ్గెస్ట్ పిల్లర్ అమ్మ అని హీరో కల్యాణ్ రామ్ అన్నారు. 'కర్తవ్యంలో వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందో.? అదే ఈ సినిమా. ఈ వయసులోనూ అమ్మ ఎలాంటి డూప్ లేకుండా స్టంట్స్ అద్భుతంగా చేశారు. నా అతనొక్కడే సినిమాలా ఈ సినిమా కూడా 20 ఏళ్లు గుర్తుంటుంది.' అని తెలిపారు.


ఆకట్టుకుంటోన్న టీజర్


మరోవైపు, తాజాగా విడుదలైన మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ప్రేమగా ఉండే తల్లీ కొడుకుల ఎందుకు దూరమయ్యారు.? మళ్లీ వాళ్లు ఎలా కలిశారు..?, తల్లి విధి నిర్వహణ, కొడుకు కోపం.. అసలు ఈ తల్లీకొడుకుల కథేంటో తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.