ప్రియదర్శి ప్రధాన పాత్రలో నాని సమర్పించిన 'కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ' మూవీ మూడు రోజుల్లోనే నిర్మాతలను ప్రాఫిట్ జోన్ లో నిలబెట్టింది. ఈ మూవీ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో తెలుపుతూ మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో అధికారికంగా మూవీ కలెక్షన్లను వెల్లడించారు. ఈ పోస్టర్ ప్రకారం 'కోర్ట్' మూవీ మూడు రోజుల్లోనే రూ.24.4 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
'కోర్ట్' 3 రోజుల కలెక్షన్స్
కంటెంట్ ఉంటే చాలు కటౌట్ తో పనిలేదని తాజాగా 'కోర్ట్' మూవీతో మరోసారి నిరూపించారు ప్రేక్షకులు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. హోలీ స్పెషల్ గా మార్చి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కుమ్మేస్తోంది. డీసెంట్ ఓపెనింగ్ రాబట్టిన ఈ మూవీ మూడు రోజుల్లోనే 24 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
మొదటి రోజు ప్రీవియర్స్ తో కలుపుకొని 'కోర్ట్' మూవీ రూ. 8.10 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో ఆ కలెక్షన్స్ రూ.15.90 కోట్లకు చేరుకున్నాయి. ఇక ముచ్చటగా మూడవరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 24.4 కోట్లను కొల్లగొట్టింది. మూడవ రోజు ఈ చిత్రం రూ. 8.5 కోట్లు వసూలు చేసింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ కలెక్షన్లతో సహా మొత్తం కలిపి రూ. 24.4 కోట్లకు చేరుకుంది. మూవీకి మంచి బజ్ ఉండడంతో వీకెండ్ ఈ మూవీ సాలిడ్ కలెక్షన్లను నమోదు చేసుకుంది. ఇక ఇప్పటికే యూఎస్ఏలో హాఫ్ మిలియన్ మార్కును అధిగమించిన ఈ చిత్రం 600k డాలర్లు వసూలు చేసి, త్వరలో మిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకునే దిశగా దూసుకుపోతోంది.
రెండ్రోజుల్లో బ్రేక్ ఈవెన్
'కోర్ట్' సినిమా కోసం మేకర్స్ 11 కోట్ల బడ్జెట్ ను ఖర్చు పెట్టినట్టు టాక్ నడుస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఇప్పటికే రూ. 9.5 కోట్లను మేకర్స్ రికవరీ చేయగా, మూవీకి 7 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆ టార్గెట్ ను బద్దలు కొట్టి రెండే రోజుల్లో ఈ మూవీ ప్రాఫిట్ జాన్ లోకి ఎంటర్ అయింది. మార్చి నెల, ఎగ్జామ్స్ టైం... ఇలాంటి అన్ సీజన్లో రిలీజ్ అయ్యి, మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నానితో పాటు చిత్ర బృందం ఫుల్ ఖుషి గా ఉంది.
ఇదిలా ఉండగా ఈ మూవీలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్ల, శివాజీ, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రామ్ జగదీష్ ఈ మూవీతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక విజయ్ బుల్గానిన్ ఈ మూవీకి సంగీతం అందించారు.