కొంతమంది హీరోయిన్లు మెరుపు తీగల్లా వచ్చి, సడన్ గా మాయమౌతూ ఉంటారు. స్టార్ హీరోయిన్ అని పిలిచే లోపే, అవకాశాలు కరువై అల్లాడుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్న ఓ హీరోయిన్ కి టెలివిజన్ షోలలో కంటెస్టెంట్ గా చేయాల్సిన గడ్డు పరిస్థితి ఎదురైంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు రిమీ సేన్. 


తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ 
2000లలో పాపులర్ అయిన హీరోయిన్ రిమీ సేన్ హిందీతో పాటు తెలుగు, బెంగాలీ సినిమాలలో నటించి, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. రీమి సేన్ అసలు పేరు శుభ మిత్ర సేన్. ఆమె మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి, తర్వాత బెంగాలీ చిత్రం 'దాము'తో బాల నటిగా చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ 1996లో రిలీజ్ అయింది. అయితే 2002లో తెలుగు మూవీ 'నీ తోడు కావాలి'తో ఆమె హీరోయిన్ గా మారింది. ఇక ఆ తర్వాత 'హంగామా' అనే కామెడీ సినిమాతో బాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి రిమీ సేన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 


మెగాస్టార్ చిరంజీవితో సినిమా 
ఇక రిమీ సేన్ తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వడమే కాదు, మంచి స్టార్ స్టేటస్ వచ్చాక మెగాస్టార్ చిరంజీవితో 'అందరివాడు' సినిమాలో నటించింది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించగా, అందులో కొడుకు ప్రేయసిగా రిమీ సేన్ నటించింది.


2023లో భాగ్ బన్, ధూమ్, క్యోమ్ కీ, గరం మసాలా, గోల్మాల్ ఫన్ అన్లిమిటెడ్, జానీ గదార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి, స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఒకానొక టైంలో ఆమె స్టార్ స్టేటస్ ఏ రేంజ్ లో ఉండేదంటే, అప్పటి స్టార్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ లాంటి ఏ లిస్ట్ హీరోయిన్లకు కూడా అంతటి కేజ్ లేదనే చెప్పాలి. దీంతో బాలీవుడ్ లో ఆమె నెంబర్ వన్ స్టార్ హీరోయిన్ గా స్థిరపడడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే దశాబ్దం ముగిసే సరికి పరిస్థితులు పూర్తిగా తలకిందులు అయ్యాయి.


Also Read:పాకిస్థాన్ నుంచి ఇండియాకు రావడానికి పెద్ధ యుద్ధం చేసిన మహిళ ఉజ్మా అహ్మద్ కథతో... జాన్ అబ్రహం 'ది డిప్లొమాట్' సినిమా రివ్యూ


2009 నాటికి ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ కావడంతో అవకాశాలు కరువయ్యాయి. ఆమె చివరిసారిగా 'షాకీర్' అనే సినిమాలో నటించింది. 2011 తరువాత అవకాశాలు లేక 'బిగ్ బాస్', 'జలక్ దిక్లాజా' అనే డ్యాన్స్ రియాల్టీ షోలలో పాల్గొంది. అయినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో సినిమాలకు గుడ్ బై చెప్పింది. 


13 ఏళ్ల తర్వాత వార్తల్లో... 
ఇక ఈ బ్యూటీ గత 13 సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తుంది. అయితే ఇటీవల ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందన్న ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఆమె ముందు, తర్వాత ఫోటోలు వైరల్ కావడంతో ప్లాస్టిక్ సర్జరీ రూమర్లు వినిపించాయి. కానీ రీమి సేన్ ఆ వార్తలను ఖండిస్తూ, తాను ఫిల్లర్లు, బొటాక్స్, పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకున్నానని క్లారిటీ ఇచ్చింది.


Also Read'సూక్ష్మదర్శిని'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో... ఇప్పుడు 'పొన్‌మాన్‌'తో JioHotstarలోకి వచ్చాడు... గోల్డ్ రికవరీ కాన్సెప్ట్‌తో బసిల్ జోసెఫ్ ఏం చేశారంటే?