Nani's Hit 3 Movie OTT Rights Sold For Huge Price: నేచురల్ స్టార్ నాని.. ఓ వైపు హిట్ మూవీస్‌తో దూసుకెళ్తూనే మరోవైపు నిర్మాతగానూ సక్సెస్ అందుకున్నారు. తాజాగా ఆయన నిర్మించిన 'కోర్ట్' (Court) మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తుండగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఆయన హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హిట్ 3' (Hit 3). ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.


అన్ని కోట్లకు అమ్ముడుపోయిందా..?


బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ 'హిట్' నుంచి వస్తోన్న మూడో చిత్రం 'హిట్ 3' (Hit 3). ఈ మూవీలో అర్జున్ సర్కార్‌గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నాని కనిపించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే 1న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' (Netflix) ఏకంగా రూ.54 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Also Read: 'పుష్ప 3' మూవీ వచ్చేది ఎప్పుడంటే? - ఫ్యాన్స్ ఖుష్ అయ్యే న్యూస్ చెప్పేసిన నిర్మాత రవిశంకర్


పట్టిందల్లా బంగారమే..


మరోవైపు, నాని నిర్మాతగా వ్యవహరించిన 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడి' (Court: The State Versus Nobody) మూవీ డిజిటల్ హక్కులను ఇదే 'నెట్ ఫ్లిక్స్' రూ.9 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే, నాని, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతోన్న మూవీ 'ది ప్యారడైజ్'. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.


ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలోకి రానుంది. ఇంకా షూటింగ్ మొదలు కాకపోయినా ఈ సినిమా ఓటీటీ డీల్ మాత్రం ఇప్పటికే జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. రూ.65 కోట్లకు డీల్ జరిగిపోయిందని తెలుస్తోంది. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయన పట్టిందల్లా బంగారం అవుతుందంటూ.. ఇదే ఇలాగే కొనసాగాలని కోరుతున్నారు.


అర్జున్ సర్కార్ వచ్చేస్తున్నాడు..


'హిట్' ఫ్రాంచైజీలో భాగంగా ఇంతకు ముందు విడుదలైన హిట్, హిట్ 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్స్‌కు సీక్వెల్‌గా 'హిట్ 3: ది థర్ట్ కేస్' రాబోతోంది. ఈ మూవీలో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన నాని లుక్స్, టీజర్ సినిమాపై హైప్‌ పెంచేశాయి. సినిమాలో నాని సరసన కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. గతేడాది 'సరిపోదా శనివారం'తో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నాని.. 'హిట్ 3'తో మరో బ్లాక్ బస్టర్‌ను కొట్టాలని చూస్తున్నారు. అయితే, ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్ సేన్, సెకండ్ పార్ట్‌లో అడవి శేష్ హీరోలుగా నటించారు.