Samantha With Saline Pic Gone Viral: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇటీవల ఓ రెండు వెబ్ సిరీస్‌ల్లో తప్ప మూవీస్‌లో ఆమె నటించలేదు. ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సామ్.. 'త్రాలాలా' పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై రూపొందిన ఫస్ట్ మూవీ 'శుభం' (Subham). ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. త్వరలోనే విడుదలకు సిద్ధమని సమంత తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.


ఆస్పత్రి బెడ్‌పై సమంత..?


అయితే, సమంత షేర్ చేసిన ఫోటోల్లో ఆమె ఆస్పత్రి బెడ్‌పై ఉంటూ సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో వైరల్‌గా మారింది. దీంతో ఆమెకు మళ్లీ ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఆ ఫోటోల్లో సామ్ నార్మల్‌గానే కనిపించారు. దాదాపు 15 ఫోటోలు షేర్ చేసిన ఆమె.. దానికి ఒక్కో క్యాప్షన్ ఇచ్చుకుంటూ వెళ్లారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోకు 'రికవరీ' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సామ్‌కు ఇంకా రికవరీ కాలేదా అంటూ ఫ్యాన్స్ నెట్టింట చర్చించుకుంటున్నారు.






Also Read: ఆ ఓటీటీలోకి 'బ్రహ్మా ఆనందం' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?, వాళ్లు ముందే చూసెయ్యొచ్చు..


నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత.. 'శాకుంతలం' మూవీ ప్రమోషన్లలో భాగంగా తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న విషయాన్ని బయటపెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు చికిత్స తీసుకున్నారు. మధ్యలో 'ఖుషి' సినిమా తప్ప మరే సినిమా చేయలేదు. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. కొన్ని వెబ్ సిరీస్‌ల్లో ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు మళ్లీ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటో  షేర్ చేయడంతో ఏం జరిగిందో అంటో.? నెట్టింట చర్చ సాగుతోంది.


'శుభం' చచ్చినా చూడాల్సిందే..


త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సమంత చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ బ్యానర్‌పై వచ్చిన ఫస్ట్ మూవీ 'శుభం' (చచ్చినా చూడాల్సిందే అనేది ఉప శీర్షిక). ఈ మూవీ షూటింగ్ పూర్తైందని.. త్వరలోనే థియేటర్లోకి భారీగా విడుదల కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ చిత్రానికి 'సినిమా బండి' ఫేం ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'పరదా'కు సైతం ఈయనే దర్శకుడు. 'శుభం' మూవీలో సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎంటర్‌టైన్‌మెంట్ సహా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది.