Vijay Sethupathi about Super Deluxe: సౌత్ ఇండస్ట్రీలో వెర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. అందుకే బాలీవుడ్ మేకర్స్ సైతం తనను క్యాస్ట్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గత రెండేళ్లలో సౌత్‌తో పాటు హిందీలో కూడా బిజీ అయిపోయాడు ఈ నటుడు. ఇప్పటికే షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’లో విలన్‌గా నటించాడు విజయ్ సేతుపతి. ఇక త్వరలోనే ‘మెర్రీ క్రిస్ట్మస్’ అనే చిత్రంతో బాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టనున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు మేకర్స్. అదే సమయంలో తన ‘సూపర్ డీలక్స్’ సినిమా ఆస్కార్స్‌కు వెళ్లకుండా.. ‘గల్లీ బాయ్’ చిత్రం వెళ్లడంపై విజయ్ సేతుపతి స్పందించాడు.
‘సూపర్ డీలక్స్’ కాకుండా ‘గల్లీ బాయ్’..
‘సూపర్ డీలక్స్’ అనే తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి ఒక ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించాడు. అప్పటికే విజయ్‌కు స్టార్‌డమ్ ఏర్పడింది. అంత పెద్ద స్టార్ అయ్యిండి ఇలాంటి పాత్ర చేశాడేంటి అంటూ చూసిన ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. చాలారోజులు ఈ సినిమా గురించి, అందులోని సేతుపతి నటన గురించే మాట్లాడుకున్నారు. అయితే ఈ సినిమా కచ్చితంగా ఆస్కార్స్ వరకు వెళ్తుందని తన ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ ఆస్కార్స్ లిస్ట్‌లో ‘సూపర్ డీలక్స్’ కాకుండా ‘గల్లీ బాయ్’లాంటి సినిమా ఉంది. ఈ విషయంలో ‘మెర్రీ క్రిస్ట్మస్’ ప్రమోషన్ సమయంలో విజయ్ సేతుపతి స్పందించారు.
నేను లేకపోయినా అదే కోరుకునేవాడిని..
‘‘అది నాకు గుండె పగిలిపోయిన మూమెంట్. నాకు మాత్రమే కాదు సూపర్ డీలక్స్ టీమ్‌కు కూడా. నేను కృంగిపోయాను. కానీ అదంతా రాజకీయం. ఏదో జరిగిందని అందరికీ తెలుసు. నేను ఆ సినిమాలో ఉన్నానని కాదు. అందులో నేను లేకపోయినా కూడా సినిమా అక్కడవరకు వెళ్లాలని కోరుకునేవాడిని. కానీ మధ్యలో ఏదో జరిగింది. దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు. అదంతా అనవసరం’’ అని టాపిక్‌ను సింపుల్‌గా పక్కన పెట్టేశారు విజయ్ సేతుపతి.
హిందీతో పాటు తమిళంలో..
త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ‘సూపర్ డీలక్స్’ 2019లో విడుదలయ్యింది. విజయ్ సేతుపతితో పాటు ఫాహద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్ లాంటి స్టార్ క్యాస్ట్ ఈ మూవీలో ఉన్నారు. ఇందులో ఒక ట్రాన్స్‌జెండర్‌గా శిల్పా అనే పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఈ మూవీలో సపోర్టింగ్ యాక్టర్‌గా సేతుపతికి నేషనల్ అవార్డ్ దక్కింది. ఇక ప్రస్తుతం ‘మెర్రీ క్రిస్ట్మస్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న మూవీ విడుదల కానుంది. హిందీతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను ఒకేసారి షూట్ చేశారు. అందుకే తమిళంలో ఒకలాగా, హిందీలో ఒకలాగా ట్రైలర్‌ను కట్ చేసి విడుదల చేశారు. దీంతో ‘మెర్రీ క్రిస్ట్మస్’ ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
Also Read: నాకు ఇక్కడ హీరోలు ఎవరూ నచ్చలేదు - ‘సైంధవ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శైలేష్ కొలను