Vijay Sethupathi About Ace Movie: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఏస్'. అరుముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ సరసన 'సప్తసాగరాలు దాటి' ఫేం రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. 7సీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మించగా.. తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి.శివప్రసాద్ రిలీజ్ చేయనున్నారు.
'ఏస్'ను సక్రెస్ చేయండి
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ టీం సందడి చేసింది. విజయ్ సేతుపతి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తనకు ఫస్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చింది అరుముగ కుమార్ అని.. మళ్లీ ఇప్పుడు ఆయనతో కలిసి పని చేస్తుండడం ఆనందంగా ఉందని విజయ్ అన్నారు. 'ఇందులో యాక్షన్, రొమాన్స్ అన్నీ ఉంటాయి. ఈ మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. బి. శివ ప్రసాద్ మల్టీ టాలెంటెడ్. ఆయనకు ఆల్ ది బెస్ట్. మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి.' అని అన్నారు.
పూరీ జగన్నాథ్ మూవీపై..
అలాగే, పూరీ జగన్నాథ్ మూవీ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. 'బెగ్గర్ అనే టైటిల్ మీరు ఫిక్స్ చేశారా?. ఆ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. పూరీ జగన్నాథ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఎయిర్ పోర్టులో రీసెంట్‌గా విశాల్‌ను కలిశా. ఆయనతో కేవలం పెళ్లి గురించి మాత్రమే మాట్లాడాను. రాజకీయాల్లోకి వస్తారా? అని కూడా విశాల్‌ను అడిగా. నేను మాత్రం ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను.' అని విజయ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: మరో ఓటీటీలోకి 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
త్వరలోనే 'రొమాంటిక్ డాన్'
'ఏస్' సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టు కనిపిస్తోందని శ్రీ పద్మిణి సినిమాస్ అధినేత బి.శివ ప్రసాద్ అన్నారు. 'ఈ స్టోరీ, క్యారెక్టర్స్ అన్నీ అద్భుతంగా ఉండబోతున్నాయి. విజయ్ సేతుపతి మళ్లీ అందరినీ ఆకట్టుకోబోతున్నారు. అన్నీ సెట్ అయితే ‘రొమాంటిక్ డాన్’ అనే సినిమాను ఆయనతో త్వరలోనే ప్రకటిస్తాను. ‘ఏస్’ సినిమాగానూ అందరికీ ముందుగానే కంగ్రాట్స్. మే 23న ఈ చిత్రం పెద్ద విజయం సాధించబోతోంది’ అని అన్నారు.
విజయ్ సేతుపతితో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని దివ్యా పిళ్లై అన్నారు. ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్ చెప్పారు. ఈ నెల 23న అందరూ సినిమా చూడాలని అన్నారు. మరోవైపు.. 'ఏస్' తన కెరీర్‌లోనే స్పెషల్ చిత్రమని యాక్టర్ బబ్లూ పృథ్వీ అన్నారు. ''ఏస్' ఫుల్ మీల్స్ లాంటి చిత్రం. కార్డ్‌లో ఏస్ అంటే ఒకటి. అన్నింటి కంటే హయ్యస్ట్ కార్డ్. అరుముగ గారి మైండ్‌లో మొత్తం స్క్రిప్ట్ ఉంటుంది. విజయ్ సేతుపతితో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఫుల్ ఫన్ ఉంటుంది. ఇది డార్క్ కామెడీతో రాబోతోన్న చిత్రం. అందరినీ ఆకట్టుకుంటుంది' అని అన్నారు.