Vijay Deverakonda Upcoming Movie: ఈరోజుల్లో చాలామంది యంగ్ హీరోలు మల్టీ స్టారర్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే గెస్ట్ రోల్స్‌లో కనిపించడానికి కూడా వెనకాడడం లేదు. అలాంటి హీరోల లిస్ట్‌లో విజయ్ దేవరకొండ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఖాతాలో పలు సినిమాలు ఉన్నాయి. అందులో ముందుగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది. ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్ చేసుకుంటున్న ఈ మూవీలో మరో యంగ్ హీరో కూడా జాయిన్ అవ్వనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.


డిశాస్టర్ అయిన ‘కృష్ణమ్మ’..


గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో హీరో ఒక సీరియస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. భాగ్యశ్రీ భోర్సే ఇప్పటికే హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. గత మూడు వారాలుగా వైజాగ్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు ఈ మూవీ సెట్‌లో మరో యంగ్ హీరో సత్యదేవ్ కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సీరియస్ పోలీస్ డ్రామాలో సత్యదేవ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ హీరో చివరిగా ‘కృష్ణమ్మ’ అనే కమర్షియల్ డ్రామా మూవీలో నటించాడు. బాక్సాఫీస్ వద్ద డిసాస్టర్‌గా నిలిచింది ఈ మూవీ. దీంతో తనలాగే హిట్స్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండతో చేతులు కలిపాడు సత్యదేవ్.


రౌడీ హీరోకు హిట్ కావాలి..


విజయ్ దేవరకొండ చివరిగా ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో మెరిశాడు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ‘గీతా గోవిందం’ రేంజ్‌లో ఊహించుకున్నారు ప్రేక్షకులు. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ దానికి పూర్తి భిన్నంగా టాక్‌ను దక్కించుకుంది. అంతే కాకుండా ఈ సినిమాలో విజయ్ దేవరకొండపై, తన నటనపై కూడా అనేక ట్రోల్స్ వచ్చాయి. అంతకు ముందు సమంతతో కలిసి తను నటించిన ‘ఖుషి’ కూడా బ్లాక్‌బస్టర్ టాక్ అందుకునేంత హిట్ ఏం అవ్వలేదు. దీంతో విజయ్ దేవరకొండకు కూడా ఇప్పుడు హిట్ చాలా ముఖ్యం. అలా హిట్స్ కావాలనుకుంటున్న ఇద్దరు హీరోలు కలిసి ఒక సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో చేతులు కలిపారు.


శ్రీలీల ఔట్..


గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన మూవీకి ఎప్పుడో పూజా కార్యక్రమం జరిగింది. అప్పుడు విజయ్ సరసన హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేశారు. తను కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంది. కానీ శ్రీలీలకు అప్పుడు ఉన్న బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కోసం మరికొందరు హీరోయిన్స్‌ను పరిగణనలోకి తీసుకోగా.. ఫైనల్‌గా భాగ్యశ్రీ భోర్సేను ఫిక్స్ చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 12వ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇంతకు ముందెన్నడూ చూడని సీరియస్ పోలీస్ రోల్‌లో చూపిస్తామని మేకర్స్ చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యింది.


Also Read: అందుకే నేను ఇంగ్లీష్‌లో మాట్లాడటం లేదు - అభిమాని కామెంట్స్‌పై రష్మిక కామెంట్స్