Rashmika Mandanna: బ్యాక్ టు బ్యాక్ ప్యాన్ ఇండియా ఆఫర్లు అందుకొని తాను కూడా ఒక ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయింది రష్మిక మందనా. రోజురోజుకీ రష్మిక ఫాలోయింగ్ మరింత పెరిగిపోతోంది. తన బిజీ షెడ్యూల్‌ను పక్కన పెట్టి ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంది రష్మిక. అక్కడ తను పూర్తిగా తెలుగులోనే మాట్లాడింది. దీంతో తెలుగు రాని ఫ్యాన్స్ కోసం ఇంగ్లీష్‌లో మాట్లాడమని ఒక ఫ్యాన్ రిక్వెస్ట్ చేయగా రష్మిక స్పందించింది.


ఇంగ్లీష్‌లో మాట్లాడండి..


రష్మికకు కేవలం తెలుగులో కాకుండా ఇతర భాషల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ‘గం గం గణేశా’ ఈవెంట్‌ను ఫాలో అయిన ఫ్యాన్స్‌కు రష్మిక మాట్లాడిన తెలుగు అర్థం కాలేదు. దీంతో ఒక ఫ్యాన్.. తనకు ట్విటర్‌లో ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ‘‘మీరు తెలుగులోనే మాట్లాడారు. అది మాకు అర్థం కాలేదు. మీకు నార్త్‌లో ఫ్యాన్స్ ఉంటే వాళ్లు కూడా మీరు మాట్లాడేది వినాలని అనుకుంటారు అని మీకు అనిపించదా? మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఎక్కువమంది మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అలా చేస్తే నార్త్‌ వాళ్లు మాత్రమే కాదు కన్నడ, తమిళం, మలయాళం భాషలు మాట్లాడే వాళ్లకి కూడా అర్థమవుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. రష్మిక.. ఈ విషయంపై స్పందించింది.


అలా అనుకుంటారు..


‘‘మీరు ఎక్కడివారు అయినా కూడా అందరూ అర్థం చేసుకునేలా ఉండడానికి ఇంగ్లీష్‌లో మాట్లాడడానికే నేను ఎక్కువశాతం ప్రయత్నిస్తాను. కానీ అలా చేస్తే నేను వారి భాషలో మాట్లాడాలి అనుకునేవారు వారి భాషను తక్కువ చేస్తున్నాను అనుకుంటారేమో అని భావిస్తాను. అలా కాకపోయినా నాకు భాష తెలియదు అని అనుకుంటారు. కానీ మీరు చెప్పింది పరిగణనలోకి తీసుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది రష్మిక. దీనికి తన ఫ్యాన్ సైతం మళ్లీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాను ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చాడు.






బ్లాక్‌బస్టర్ పాట..


సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్, రష్మిక మందనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ నుండి తాజాగా కపుల్ సాంగ్ అంటూ ‘సూసేకి’ అనే పాట విడుదలయ్యింది. విడుదలయిన కొన్ని గంటల్లోనే రికార్డులను తిరగరాసింది. చాలామంది మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ‘పుష్ప’పై అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ‘పుష్ప 2’ను ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. దానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా యాడ్ అవుతోంది. ఇప్పటికే ‘పుష్ప 2’ నుండి విడుదలయిన రెండు పాటలు ఇన్‌స్టాంగ్‌గా చార్ట్‌బస్టర్ అయిపోయాయి.


Also Read: బాలీవుడ్ ఖాన్స్‌ను వెనక్కి నెట్టిన దీపికా పదుకొనె - ఆ విషయంలో ఆమే ఫస్ట్!