Allari Naresh's Aa Okkati Adakku quietly Released In OTT: కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్. కానీ, ఈ మ‌ధ్య స్టైల్ మార్చి సీరియ‌స్ సినిమాల‌తో ప్రేక్ష‌కులకు ముందుకు వ‌చ్చాడు. 'నాందీ', 'ఉగ్రం', 'నా సామి రంగ' లాంటి సినిమాలు చేసి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు మ‌ళ్లీ మిమ్మ‌ల్ని క‌డుపుబ్బా నవ్విస్తాను అంటూ మ‌రోసారి కామెడీ జోన‌ర్‌తో ప్రేక్ష‌కులు మందుకు వ‌చ్చాడు. అదే 'ఆ ఒక్క‌టీ ఆడ‌క్కు'. మే 3న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా మెప్పించ‌లేక పోయింది. అల్ల‌రోడు జ‌నాల్ని పెద్ద‌గా న‌వ్వించ‌లేక‌పోయాడు. ఇప్పుడు సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేశారు. సైలెంట్ గా ఓటీటీలోకి వ‌చ్చేసింది ఈ సినిమా. ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండా ఓటీటీలో ప్ర‌త్య‌క్షం అయ్యింది. 


స్ట్రిమింగ్ ఎక్క‌డంటే? 


ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వ‌చ్చింది 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' సినిమా. రిలీజైన 20 రోజుల‌కే ఓటీటీలోకి వ‌చ్చేసింది. మే 31 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో పెద్ద‌గా స్పంద‌న లేక‌పోవ‌డంతో ఓటీటీలో రిలీజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. నిజానికి సినిమా రిలీజైన మూడు నెల‌ల‌కు గాని ఓటీటీల్లోకి రావు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం ముందుగానే వ‌చ్చేస్తున్నాయి. ఈ మ‌ధ్య చాలా సినిమాలు థియేట‌ర్లలో చూడ‌ని ప్ర‌జ‌లు ఓటీటీల్లో చూసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ్డా.. ఓటీటీల్లో మాత్రం బంప‌ర్ హిట్ కొడుతున్నాయి. చాలా సినిమాలో ఓటీటీలో ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి.


క‌థేంటంటే? 


గణ అలియాస్ గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఉద్యోగి. తన కంటే ముందు తమ్ముడు (విరూపాక్ష ఫేమ్ రవికృష్ణ)కి, మేనమామ కూతురు దేవి (జేమీ లివర్)కి పెళ్లి చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన తమ్ముడు ఉండటంతో అతడికి పిల్లను ఇవ్వడానికి అమ్మాయిల‌ తల్లిదండ్రులు ఎవరూ ముందుకు రారు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయమైన సిద్ధి (ఫరియా అబ్దుల్లా)తో ప్రేమలో పడతాడు. అయితే... 'నేను మీకు కరెక్ట్ కాదు' అని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తుంది ఆ అమ్మాయి. కానీ, ఇద్దరూ స్నేహితులుగా మెలుగుతారు. మ్యాట్రిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు దోచే ఖిలాడీ లేడి సిద్ధి అని వార్తల్లో ఎందుకు వచ్చింది? ఓ మ్యాట్రిమోనీ సంస్థ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది? పెళ్లి కాని అబ్బాయిలు ఏ విధంగా మోసపోయారు?  సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏమిటి? నిజానిజాలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్ల‌రి న‌రేశ్ హీరో కాగా.. ఫ‌రియా అబ్దుల్లా ఆయ‌న స‌ర‌స‌న హీరోయిన్ గా చేశారు. ఈ సినిమాలో  జెమీ లివర్, 'వెన్నెల' కిశోర్, మురళీ శర్మ, గౌతమి, హర్ష చెముడు, ర‌వికృష్ణ‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు.  


Also Read: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే - స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?