'లైగర్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత రీసెంట్గా 'ఖుషి' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ కి జోడిగా సమంత కథానాయికగా నటించింది. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ని అందుకొని బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ విజయ్ దేవరకొండకి కావలసిన భారీ కం బ్యాక్ ని ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాన్ని 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నాడు.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీలను ఈ మూవీలో ముందు హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్టు నుండి శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందట. సినిమాలో సాధారణ కానిస్టేబుల్ నుంచి మాఫియా లీడర్ గా ఎదిగిన హీరో కథనే గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాలో చూపించబోతున్నారట.
సితార ఎంటర్టైన్మెంట్స్ బాండర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 'VD12' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే కదా. సినిమా రెండు భాగాలుగా ఉండబోతుందని మేకర్స్ ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. పార్ట్ వన్ బ్లాక్ బాస్టర్ హిట్ అయితే పార్ట్ 2 పై హైప్ పెరుగుతోందని ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు.
కానీ రీసెంట్ టైమ్స్ లో రెండు భాగాలుగా చేయబోతున్నట్లు అనౌన్స్ చేస్తూన్నా కూడా మొదటి భాగం డిజాస్టర్ కావడంతో రెండవ భాగాన్ని తెరకెక్కించే ఆలోచనను పక్కన పెట్టేస్తున్నారు. 'బాహుబలి 2', 'కేజిఎఫ్ 2' లాంటి సినిమాలు సీక్వెల్స్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించాయి. అయితే కథలో కంటెంట్ బావుంటే కొన్ని సీక్వెల్స్ సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్ మూవీని కూడా రెండు భాగాలుగా తీయబోతున్నారట.
గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి సీక్వెల్ ఐడియాని ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరియర్ చాలా డౌన్ ఫాల్ లో ఉంది. ఫ్యాన్ ఇండియా బ్రాండ్ తో వచ్చిన 'లైగర్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ దెబ్బ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన 'ఖుషి' కూడా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నానూరితో రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. మరి ఈ ప్రాజెక్టుతో విజయ్ కి ఎలాంటి సక్సెస్ వస్తుందో చూడాలి.
Also Read : 'భగవంత్ కేసరి' బంధం విలువ చెప్పే పాట - 'ఉయ్యాలో ఉయ్యాల' రిలీజ్ ఎప్పుడంటే?