Vijay Devarakonda New Movie Title Fix: 'జెర్సీ' మూవీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా 'వీడీ 12' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై హైప్‌ను పెంచేశాయి. ఈ సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తానని నిర్మాత నాగవంశీ ఇటీవలే తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొనగా.. టైటిల్ ఏంటనేది అందరిలోనూ ఆసక్తి రేపింది. ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: తండేల్ రివ్యూ: సముద్రంలో చిక్కిన ప్రేమ... తీరానికి ఎలా చేరింది? నాగచైతన్య సినిమా హిట్టా? ఫట్టా?
అదే టైటిల్ ఫిక్సయిందా..?
'VD 12' సినిమాకు సామ్రాజ్యం అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అటు కింగ్ డమ్ అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే, విజయ్ అభిమానులు టైటిల్ రిలీజ్ చేయాలంటూ నిర్మాత నాగవంశీని సోషల్ మీడియా వేదికగా పలుమార్లు రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే టైటిల్ ఇదేనంటూ రూమర్స్ వస్తున్నాయి. అయితే, ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని.. టైటిల్ గురించి అతి త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా మే నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
ఫిబ్రవరి 12న టైటిల్ టీజర్..
అయితే, అభిమానులకు నాగవంశీ గుడ్ న్యూస్ చెప్పారు. 'VD12' మూవీ టైటిల్ అండ్ టీజర్‌ను ఫిబ్రవరి 12న రిలీజ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 'ప్రపంచాన్ని ఉత్కంఠబరితమైన శిఖరానికి తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాం.' అంటూ ఓ పోస్టర్ పంచుకున్నారు. ఇన్ని రోజులు వేచి ఉన్నందున ఈ టీజర్ కచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ.. 'మీరందరూ ఓపిక పట్టారు. మీ కఠినమైన ప్రేమను మేము చూశాం. మేము ఇప్పుడు మా ప్రపంచాన్ని, మా కథను ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టైటిల్, టీజర్‌తో మీరంతా గర్వపడతారు.' అని అన్నారు.
కాగా.. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో హీరో నానికి ఫ్రెండ్ రోల్‌లో నటించిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలోనూ మెరిశారు. ఆ తర్వాత పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయారు. అనంతరం వచ్చిన గీత గోవిందం, లైగర్ చిత్రాలు ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే పట్టుదలతో విజయ్ ఉన్నారు. స్పై థ్రిల్లర్ కథాంశంలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో తాజా చిత్రంలో ముందుకొస్తున్నారు.
Also Read: 'తండేల్' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యం - 'గేమ్ ఛేంజర్' బాటలోనే నాగ చైతన్య మూవీ ?