Vijay Deverakonda Gets Criticised: రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తీరుపై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. రష్మికను పట్టించుకోకుండ అలా వదిలేయడమేంటని అసహనం చూపిస్తున్నారు. కాగా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ వార్తలపై వారు ఎప్పుడు స్పందించలేదు. తమ రిలేషన్‌షిప్‌పై ప్రశ్నించినప్పుడల్లా స్నేహితులమే అంటూ దాటేస్తూ వస్తున్నారు. కానీ తరచూ వీరిద్దరు కలిసి లంచ్‌, డిన్నర్‌ డేట్స్‌కి వెళ్లి కెమెరాల కంట పడుతుంటారు. అంతేకాదు సీక్రెట్‌గా వెకేషన్‌కి వెళ్లి విడివిడిగా ఫోటోలు షేర్‌ చేస్తుంటారు. అయితే లోకేషన్స్‌ బట్టి వీరిద్దరు కలిసి వెళ్లారని నెటిజన్స్‌ పట్టేస్తుంటారు. అలా వీరిద్దరు తరచూ తమ డేటింగ్ రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు.


డేటింగ్ రూమర్స్


మొన్న ఆ మధ్య పుష్ప 2 రిలీజ్‌ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో ఇండస్ట్రీ అతడినే పెళ్లి చేసుకుంటారా? అని అడగ్గా... దానికి సమాధానం 'మీ అందరికి తెలుసు' అంటూ హింట్‌ ఇచ్చింది. వీరి ప్రేమయాణంపై అధికారిక ప్రకటన లేకపోయిన, తమ తీరుతో రిలేషన్‌లో ఉన్నామని చెప్పకనే చెబుతున్నారనేది నెటిజన్ల అభిప్రాయం. ఈ క్రమంలో వారిద్దరు జంటగా ఎక్కడ కనిపించిన మీడియా కెమెరాలు వారినే ఫోకస్‌ చేస్తుంటాయి. తాజాగా విజయ్‌, రష్మిక మరోసారి జంటగా మీడియాకు చిక్కారు. వీరిద్దరు హైదరాబాద్‌లో కనిపించారు. అయితే ఈసారి విజయ్ తీరుపై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. వీరి అభిమానులు మాత్రం ఏంటీ? బ్రో అలా చేశావంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలేమైందో చూద్దాం.


అలా ఎలా వదిలిసావ్ బ్రో..


విజయ్‌, రష్మికలు ప్రస్తుతం సినిమాలతో వాళ్ల ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు. రష్మిక నటించి 'పుష్ప 2' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. హిందీలో విక్కీ కౌశల్‌ జంటగా నటించిన 'ఛావా' మూవీ ఫిబ్రవరి 14న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. అలాగే ఆమె 'కుబేర', 'సికందర్‌' చిత్రాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. అయితే ఇటీవల రష్మిక జిమ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. తన యాక్షన్‌ 'సికందర్‌' మూవీ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా తన గాలికి బలమైన గాయమైంది. దీంతో కొంతకాలం ఆమె విశ్రాంతి తీసుకోవాలని వైద్యలు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నవలేని స్థితిలో ఉంది. ఈ సమయంలో హైదరాబాద్‌లో రష్మిక, విజయ్‌లు కలిసి కనిపించారు. విజయ్‌ ముందు నడుచుకుంటూ వచ్చి కారు ఎక్కాడు. రష్మిక మాత్రం గాలి గాయం కారణంగా నడవడానికి ఇబ్బంది పడుతూ మెల్లి మెల్లిగా మెట్లు దిగుతూ బయటకు వస్తుంది. ఇది చూసి అంతా విజయ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం కారు ఎక్కించడానికి కూడా రష్మికకు సాయం చేయడం లేదు అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.


Also Readఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే


అలాగే మరోకరు 'కనీసం సాయం చేయాలి కదా లైగర్‌' అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేశాడు. మరోకరు "కనీసం తనని పట్టించుకోకుండ అలా ఎలా వదిలేసి వెళ్తావ్" అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో రష్మిక తన హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాలి గాయంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతించానని, ఇది తనకు తాను న్యూ ఇయర్‌కి ఇచ్చుకున్న గిఫ్ట్‌ అంటూ సరదాగా పోస్ట్‌ చేసింది. అంతేకాదు ఇది ఎంతకాలానికి తగ్గుతుందో కూడా చెప్పలేను అంటూ బాధను వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే నడవలేని స్థితిలో ఉన్న రష్మిక వీలు చైర్‌పైనే తన ఛావా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరో విక్కీ కౌశల్‌ తనకి హెల్స్‌ చేస్తున్న వీడియోలు, టీం సాయంతో కుంటుతూ నడుస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. వీటిపై నెటిజన్స్‌ నుంచి రకరకాల స్పందన వస్తోంది. కొంతమంది ఓవరాక్షన్‌ అంటూ కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు ప్రోఫెషన్‌ విషయంలో తనకు ఉన్న డెడికేషన్‌ని కొనియాడుతున్నారు. 


Also Read: పవన్, మహేష్ సినిమాలతో 100 కోట్ల నష్టం... రమేష్‌దే తప్పు - బండ్ల గణేష్ వైరల్ ట్వీట్