Where is Anasuya Bharadwaj? అనసూయ ఎక్కడ? వేర్ ఇజ్ అనసూయ? అని రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అందుకు కారణం నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'ది ప్యారడైజ్' (The Paradise) గ్లింప్స్. అందులో డైలాగ్. కొన్ని రోజులుగా నాని, విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం జరుగుతోంది. వాళ్ళిద్దరి మధ్యలోకి కొందరు ఇప్పుడు అనసూయను లాగుతున్నారు. ఎందుకు? ఆవిడ ఏం చేసింది? ది ప్యారడైజ్ సినిమాకు ఆవిడకు సంబంధం ఏంటి? అంటే....
అప్పట్లో దేవరకొండను విమర్శించావ్ కదా!నాని (Nani)ని విజయ్ దేవరకొండ అభిమానులు ట్రోల్ చేయడం ఇటీవల మొదలు అయింది. కానీ, అనసూయను ఎప్పటి నుంచో ట్రోల్ చేస్తున్నారు. వాళ్ల మధ్య గొడవ ఇప్పటిది కాదు... 'అర్జున్ రెడ్డి' సినిమా టైమ్ నుంచి ఉంది.
'అర్జున్ రెడ్డి' సినిమాలో విజయ్ దేవరకొండ 'మాద....ద్' డైలాగ్ చెప్పడం పట్ల అనసూయ భరద్వాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిని తిట్టేటప్పుడు మధ్యలోకి తల్లిని ఎందుకు తీసుకు వస్తారంటూ ఆవిడ ప్రశ్నించారు. అనసూయతో ఒక టీవీ ఛానల్ ఆల్మోస్ట్ గంటసేపు ఆ ఇష్యూ మీద కార్యక్రమం నిర్వహించింది. సినిమాను సినిమాలా చూడకుండా వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు లాగుతారంటూ విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ మీద మండిపడ్డారు.
అప్పుడప్పుడు అనసూయ వర్సెస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గొడవ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటుంది. ఆంటీ కామెంట్ కూడా ఆ కోవలోనిదే అని చెప్పవచ్చు. కట్ చేస్తే... 'ది ప్యారడైజ్' గ్లింప్స్ విడుదల తర్వాత మరోసారి అనసూయ మీద విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
నాని సినిమాలో ఆ డైలాగ్ వినిపించలేదా?'ది ప్యారడైజ్' గ్లింప్స్ మామూలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. శ్రీకాంత్ ఓదెల సినిమాను ఎలా తీయబోతున్నారో? దసరా లాంటి రా అండ్ రస్టిక్ సినిమా తీసిన దర్శకుడు... ఈసారి మరింత బ్లడీ వయలెన్స్ సినిమా తీయబోతున్నారని నాని అభిమానులు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.
Also Read: విజయ్ దేవరకొండను నాని తొక్కేస్తున్నాడా? సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్... మంట పెట్టిన యూట్యూబర్
సగటు తెలుగు సినిమా ప్రేక్షకులలో సైతం అంచనాలు ఏర్పడేలా చేయడంలో 'ది ప్యారడైజ్' గ్లింప్స్ సక్సెస్ అయ్యింది. అయితే, ఆ ఒక్క పదం మీద విమర్శలు వస్తున్నాయి. 'లం....క' అని ఒక మహిళ చేత చెప్పించడం ఏమిటి? అని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే హీరో చేతి మీద ఆ టాటూ ఉంది. కథలో ఆ పదానికి చాలా ప్రాముఖ్యం ఉందని సమాచారం. అందువల్ల సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలని 'ది ప్యారడైజ్' యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే అనసూయకు ఆ డైలాగ్ వినిపించలేదా? అని దేవరకొండ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. తమ హీరో సినిమాలో డైలాగ్ వచ్చినప్పుడు రచ్చ రచ్చ చేసిన అనసూయ ఎప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి ఆ ట్రోల్స్ అనసూయ వరకు వెళ్లాయో లేదో చూడాలి.
Also Read: కోలీవుడ్ హీరో కార్తీకి గాయాలు... 'సర్దార్ 2' సెట్స్‌లో మరోసారి ప్రమాదం