మాస్ మహారాజా రవితేజ, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ సూపర్ హిట్. వాళ్ళిద్దరూ సినిమా అంటే ఈ తరం ప్రేక్షకులకు రాజా ది గ్రేట్ గుర్తుకు వస్తుంది. అందులో వాళ్ళ కామెడీ ప్రేక్షకులు అందరినీ నవ్వించింది. ఆ సినిమాకు ముందు 'నిప్పు'లోనూ కలిసి నటించారు. అందులో రాజేంద్ర ప్రసాద్ మామగారి టైపు పాత్రలో కనిపించారు. ఈ రెండు సినిమాలకు ముందు... 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి'లో నటించారు. అందులో రాజేంద్ర ప్రసాద్ హీరో అయితే రవితేజ ఒక క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు 'మాస్ జాతర' సినిమాతో మరోసారి వీళ్ళ కాంబినేషన్ రిపీట్ అవుతోంది.
రవితేజకు తాతగా రాజేంద్రప్రసాద్!రవితేజ కథానాయకుడిగా 'సామజవరగమన' రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. తాను ఆ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నట్లు రాజేంద్రప్రసాద్ కన్ఫర్మ్ చేశారు.
'మాస్ జాతర' సినిమాలో రవితేజకు తాను తాతయ్య పాత్ర పోషిస్తున్నట్లు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన 'రాబిన్ హుడ్' సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మీడియాతో ముచ్చటించారు. అప్పుడు రవితేజ సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్పారు. 'మాస్ జాతర' మామూలుగా ఉండదని నట కిరీటి అంటున్నారు.
పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్న రవితేజ!'మాస్ జాతర'లో రవితేజ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు సేమ్ టీజర్ చూసిన ఎవరికైనా అర్థం అవుతోంది. ఇప్పటి వరకు ఆయన పోలీస్ రోల్స్ చేసిన సినిమాలన్నీ విజయాలు సాధించాయి. ఇప్పుడు 'మాస్ జాతర' మీద కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ రవితేజ సూపర్ హిట్ సినిమాలను గుర్తు చేయడమే కాదు... వింటేజ్ మాస్ మహారాజా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని అర్థం అయింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
Also Read: జీ 5కి డబ్బులే డబ్బులు... ఓటీటీలోనూ రికార్డులు - కాసులు కురిపించిన 'సంక్రాంతికి వస్తున్నాం'