Prithviraj Sukumaran's Post Viral On 'SSMB29' Project: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Maheshbabu) కాంబోలో 'SSMB29' వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో సినిమా తెరకెక్కుతుండగా.. ఇప్పటివరకూ ఈ సినిమా గురించి నెట్టింట రూమర్స్ తప్ప ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఎలాంటి లీకులు లేకుండా దర్శకుడు రాజమౌళి అండ్ టీం అత్యంత జాగ్రత్త వహిస్తున్నారు. నటీనటులు, స్టోరీల విషయంలో ఊహాగానాలే తప్ప ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు. ఈ సినిమా అప్ డేట్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే ఈ మూవీపై ఏ చిన్న రూమర్స్ కానీ వార్త కానీ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది. తాజాగా.. మరోసారి ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది రాజమౌళి మహేశ్ సినిమా కోసమేనంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Also Read: టాలీవుడ్ మూవీలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ - ఏ సినిమాలో నటించారో తెలుసా?
ఆయన ఏం పోస్ట్ చేశారంటే..?
రాజమౌళి, మహేశ్ ప్రాజెక్టులో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయన తన 'ఇన్‌స్టా' పేజీలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'ఓ దర్శకుడిగా నా చేతిలో ఉన్న సినిమాలు అన్నీ పూర్తి చేశాను. వీటికి సంబంధించిన మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. నటుడిగా తెరపై కనిపించేందుకు సిద్ధపడుతున్నా. పరభాష చిత్రంలో కనిపించబోతున్నా. ఆ మూవీలో పెద్ద డైలాగ్స్ ఉన్నాయని తెలిసి కాస్త భయపడుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. అయితే, ఇది 'SSMB29' ప్రాజెక్టు కోసమేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీని కోసమే పృథ్వీరాజ్ తన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, గతంలోనూ పలు ఇంటర్వ్యూల్లో తాను మహేశ్ - రాజమౌళి సినిమాలో నటిస్తున్నట్లు వచ్చిన రూమర్లపై స్పందించారు. 'నాకంటే మీడియా, నెటిజన్లకే ఎక్కువ విషయాలు తెలిశాయి. ఇంకా దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. చర్చలు జరుగుతున్నాయి. అవి ఫైనల్ అయ్యాక ఈ విషయం గురించి మాట్లాడుకుందాం.' అని తెలిపారు.
'SSMB29' ప్రాజెక్ట్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా.. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు న్యూ లుక్‌లో కనిపించనుండగా.. ఇటీవల ఆయన జిమ్‌లో వర్కౌట్ చేస్తోన్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రియాంకచోప్రా ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరోతో పాటు ఆమె రోల్‌కు కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.