David Warner: నితిన్ 'రాబిన్ హుడ్'లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ - ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?
Robinhood: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ మూవీతో వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు.

David Warner Tollywood Entry With Nithiin's Robinhood Movie: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) త్వరలోనే సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఆయన టాలీవుడ్‌లో ఓ సినిమాలో నటిస్తున్నారని గతంలోనే ప్రచారం సాగినా అధికారికంగా ఎక్కడా ఎలాంటి లీకులు లేవు. తాజాగా.. ప్రముఖ నిర్మాత రవిశంకర్ (Ravi Shankar) దీనిపై క్లారిటీ ఇచ్చారు. నితిన్ (Nithiin) హీరోగా నటించిన 'రాబిన్‌హుడ్'లో (Robinhood) ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన 'కింగ్ స్టన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వార్నర్ లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ తమ చిత్రం ద్వారా ఇండియన్ సినిమాకు, టాలీవుడ్‌కు పరిచయం అవుతుండడం తమకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సినిమా కోసం వార్నర్ రోజుకు రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది.
వార్నర్.. క్రికెట్‌తోనే కాకుండా రీల్స్‌తోనూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన.. పలువురు తెలుగు హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ వీడియోలు చేశారు. బాహుబలి, పుష్ప, డీజే టిల్లు వంటి ప్రముఖ క్యారెక్టర్లలో.. తన ఫేస్ కనిపించేలా ఒరిజినల్ వీడియోలను మార్ఫింగ్ చేసి సందడి చేయగా అవి వైరల్‌గా మారాయి. 'రాబిన్‌హుడ్' మూవీ షూటింగ్ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు.. వార్నర్‌కు సంబంధించి కొన్ని స్టిల్స్ కూడా బయటకొచ్చాయి. దీంతో ఆ సినిమాలో కనిపిస్తారని ప్రచారం జోరందుకుంది. అదే నిజమని ఇప్పుడు నిర్మాత రవిశంకర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వార్నర్ ఏ రోల్‌లో కనిపిస్తారనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆయన రోల్‌పై ఆసక్తి నెలకొంది.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'. 'భీష్మ' వంటి హిట్ తర్వాత వీరిద్దరి నుంచి వస్తోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. నితిన్ సరసన శ్రీలీల నటిస్తుండగా.. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 28న 'రాబిన్‌హుడ్' థియేటర్లలో రిలీజ్ కానుంది. మరోవైపు, కోలీవుడ్ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా వస్తోన్న మూవీ 'కింగ్ స్టన్'. ఈ సినిమా ఇండియాస్ ఫస్ట్ సీ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఫిల్మ్ అని మేకర్స్ తెలిపారు. సముద్ర తీర గ్రామం నేపథ్యంలో సాగే కథ బ్యాక్ డ్రాప్‌గా మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా జీవీ ఓ మత్స్యకారుడిగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేయాలనుకున్నాడు? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'రామం రాఘవం', ఎందులోనో తెలుసా!