Huma Qureshi's Maharani Web Series Season 4 Teaser Release: క్రైమ్, హారర్, థ్రిల్లర్, పొలిటికల్ మూవీస్ మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లు సైతం మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అలాంటి సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'మహారాణి' (Maharani). ప్రముఖ నటి హ్యూమా ఖురేషి (Huma Qureshi) లీడ్ రోల్ పోషించిన ఈ సిరీస్ అందరి మనసుల్లో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పటికే 3 సీజన్లు అలరించగా తాజాగా నాలుగో సీజన్ 'సోనీ లివ్'లో (SonyLIV) స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. 'కొందరు నన్ను నిరక్ష్యరాస్యురాలిని అన్నారు. ఇంకొందరు హంతకురాలిని అన్నారు. మరి కొందరు కాబోయే ప్రధాని అని అన్నారు. కాని అధికారంపై కాదు కుటుంబంపై మమకారం, వ్యామోహం ఉంది. ఆ కుటుంబం బీహారే. ఎవరైనా నా కుటుంబానికి హాని తలపెట్టాలని చూస్తే.. వాళ్ల అధికార పీఠాన్ని కదిలించేస్తాను.' అంటూ ఖురేషీ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ కూడా పొలిటికల్ థ్రిల్ పంచేలా ఉందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది.

ఓ సాధారణ మహిళ సీఎంగా ఎలా ఎదిగారనేదే ప్రధానాంశంగా రూపొందింది 'మహారాణి' సిరీస్. తొలి సీజన్ 2021లో రాగా.. కరణ్ శర్మ, రెండో సీజన్ 2022లో రాగా.. రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించారు. ఇక మూడో సీజన్ సౌరభ్ భావే డైరెక్షన్‌లో 2024లో వచ్చింది. తాజాగా.. నాలుగో సీజన్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. పెద్దగా చదువుకోని రాణి భారతి (హ్యూమా ఖురేషి) మహిళ గృహిణి నుంచి రాష్ట్ర సీఎంగా ఎదిగిన తీరును చూపించే సిరీస్ ఇది. ఈ వ్య‌వ‌స్థ‌లో ఆమెకు ఎదురైన స‌వాళ్లు, అధికారంలో ఉన్న ఇబ్బందులు, కుట్ర‌లు, రాజ‌కీయ వైరుద్ధ్యాలు ఇందులో మ‌నం చూడొచ్చు. ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన గ‌త మూడు సీజ‌న్స్ త‌ర‌హాలోనే నాలుగో సీజ‌న్ కూడా మ‌రింత గ్రిప్పింగ్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నుంది.

Also Read: తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేయాలనుకున్నాడు? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'రామం రాఘవం', ఎందులోనో తెలుసా!

ఎలాంటి భ‌యం లేకుండా ఉండే ముఖ్య‌మంత్రి రాణి భార‌తిగా హ్యుమా ఖురేషి త‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌టానికి ఎంత దూర‌మైనా వెళ్లే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో అల‌రించ‌బోతున్నట్లు తెలుస్తోంది. అయితే, స్టోరీ ఏంటనేది మాత్రం రివీల్ కాలేదు. సిరీస్‌లో హ్యూమా ఖురేషీతో పాటు అమిత్ సియాల్, వినీత్ కుమార్, ప్రమోద్ పాఠక్, కాని కుస్రుతి, అనూజా సాఠే, సుషీల్ పాండే, దిబ్యేందు భట్టాచార్య, సోహమ్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్వరలో సోనీ లివ్‌లో ప్రసారం కానున్న ‘మహారాణి’ సీజన్ 4లో పవర్‌ఫుల్ రాణి భారతిని వీక్షించడానికి సిద్ధం కండి. 

Also Read: టాలీవుడ్ మూవీలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ - ఏ సినిమాలో నటించారో తెలుసా?