Trending
Karthi Injured: కోలీవుడ్ హీరో కార్తీకి గాయాలు... 'సర్దార్ 2' సెట్స్‌లో మరోసారి ప్రమాదం
Karthi's Sardar 2 Update: 'సర్దార్ 2' చిత్రీకరణలో మరోసారి ప్రమాదం జరిగింది. ఈసారి హీరో కార్తీకి గాయాలైనట్లు తెలిసింది. దాంతో చిత్రీకరణ నిలిచింది. ఆ వివరాల్లోకి వెళితే...
తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ కథానాయకుడు కార్తీ (Kollywood Actor Karthi). ఆయన సూర్య తమ్ముడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైనా... సూర్య కంటే ముందు స్ట్రయిట్ తెలుగు సినిమా (నాగార్జునతో 'ఊపిరి') చేశారు. తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంటున్నారు. ఇప్పుడు హీరో నటిస్తున్న తాజా సినిమా 'సర్దార్ 2' (Sardar 2). ఆ సినిమా చిత్రీకరణలో ఆయనకు గాయాలు అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే...
మైసూరులో షూటింగ్ చేస్తుండగా...
Actor Karthi Injured: 'సర్దార్ 2' చిత్రీకరణ కోసం యూనిట్ అంతా మైసూర్ వెళ్ళింది. కీలక సన్నివేశాలు తీస్తున్న సమయంలో కార్తీ గాయాల పాలు అయ్యారు. వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లగా... వారం రోజులు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారట. దాంతో ఆయన చెన్నై వచ్చేశారు. అలాగే సినిమా యూనిట్ కూడా చెన్నై రిటర్న్ అయ్యింది.
గాయాల నుంచి కార్తీ కోలుకున్న తర్వాత మళ్ళీ చిత్రీకరణ ప్రారంభించాలని చిత్ర దర్శకుడు, నిర్మాత డిసైడ్ అయ్యారు. హీరో మీద తీయాల్సిన సన్నివేశాలు కావడంతో మరోదారి లేక షూటింగ్ ఆపేశారు.
'సర్దార్ 2' చిత్రీకరణలో ప్రమాదం జరగడం ఇది ఏమీ తొలిసారి కాదు. ఈ సినిమా ప్రారంభం తర్వాత విషాదం చోటు చేసుకుంది. చెన్నైలో ఫస్ట్ షెడ్యూల్ (రెగ్యులర్ షూటింగ్) స్టార్ట్ చేసినప్పుడు... ప్రమాదవశాత్తు ఒక స్టంట్ మాన్ మృతి చెందారు. ఇప్పుడు కార్తీక్ గాయాల పాలు అయ్యారు.
Also Read: రవితేజకు తాతగా రాజేంద్రుడు... మాస్ జాతర మామూలుగా ఉండదు తమ్ముళ్లూ!
'సర్దార్ 2' సరసన ముగ్గురు హీరోయిన్లు
Sardar 2 movie cast and crew: 'సర్దార్' సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ కాక మలయాళ భామ రజిషా విజయన్ ఒక కీలక పాత్ర చేశారు. ఇప్పుడు సీక్వెల్ 'సర్దార్ 2'లో మరోసారి రజిషా విజయన్ యాక్ట్ చేస్తున్నారు. ఆవిడ కాకుండా ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లు యాడ్ అయ్యారు.
రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్'లో ఒక హీరోయిన్ రోల్ చేస్తున్న మలయాళ భామ మాళవిక మోహన్. విక్రమ్ 'తంగలాన్', రజనీకాంత్ 'పేట' సినిమాలు చేశారు. ఆవిడ 'సర్దార్ 2'లో నటిస్తున్నారు. అలాగే, నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్', కింగ్ అక్కినేని నాగార్జున 'నా సామి రంగ' సినిమాల్లో నటించిన ఆషికా రంగనాథ్ మరొక హీరోయిన్. ప్రస్తుతం ఆవిడ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమాలో కూడా నటిస్తున్నారు.
పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న 'సర్దార్ 2' సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ పతాకం మీద ఎస్ లక్ష్మణ్ కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో ఎస్ జె సూర్య ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. చెన్నైలో యాక్షన్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో కార్తీ, ఎస్ జె సూర్య మీద భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిసింది.