Nani's The Paradise Movie Glimpse Dialogues Criticizes In Social Media: నేచురల్ స్టార్ నాని (Nani), 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) లేటెస్ట్ మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్‌ను చూసిన అభిమానులు.. నాని యాక్షన్ వేరే లెవల్ అంటూ ఖుష్ అవుతున్నారు. 'చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాశారు కానీ.. అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవరూ రాయలేదు.' అంటూ మొదలయ్యే గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా.. కొన్ని డైలాగ్స్ కొన్ని ఇబ్బంది పెట్టాయి. 'ఇది కడుపు మండిన కాకుల కథ.. తూ అనిపించుకున్న కాకులు తల్వార్లు పట్టినయ్. ఇది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక ల**** కొడుకు కథ. నా కొడుకు నాయకుడైన కథ.' అంటూ సాగే డైలాగ్స్‌ను కొందరు నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఫ్యాన్స్ మాత్రం దీనికి కౌంటర్ ఇస్తున్నారు.
సినిమాలో ఇలాంటి భాషను ఆమోదించకూడదని కొందరు నెటిజన్లు భావిస్తుండగా.. 'సినిమా స్టోరీ సందర్భాన్ని బట్టి అలాంటి పదాలు వాడి ఉండొచ్చు.' అంటూ కొందరు సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి పదాల వాడకం సాధారణం అని.. సాధారణ తెలంగాణ యాసలో అలాంటి పదాలు ఉపయోగిస్తున్నారని.. వాటిని పెద్దగా పట్టించుకోకూడదని చెబుతున్నారు. సినిమాను సినిమాగా చూడాలని.. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా.. వేరే లెవల్‌లో మూవీ ఉంటుందని పేర్కొంటున్నారు. మరి.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల్ ఈ డైలాగ్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుందని.. అంతవరకూ విమర్శించడం కరెక్ట్ కాదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
'ది ప్యారడైజ్' గ్లింప్స్ విషయానికొస్తే.. మూవీలో నాని లుక్, గెటప్ ఊర మాస్‌గా ఉన్నాయి. చరిత్రలో లేని అట్టడుగున ఉన్న ఓ జాతికి సంబంధించిన నాయకుడిగా నాని కనిపించనున్నట్లు గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. సినిమాలో నాని లుక్ పూర్తిగా డిఫరెంట్‌గా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఆయనకు కాకి రెక్కలు తొడిగినట్లుగా ఉన్న లుక్ హైప్‌ను పెంచేసింది. బానిసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు, తల్లీకొడుకుల సెంటిమెంట్ ఈ స్టోరీకి కీలకమని తెలుస్తోంది. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ, బెంగాళీ భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ వంటి అంతర్జాతీయ భాషల్లోనూ ఒకేసారి థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారా..?
నాని 'ది ప్యారడైజ్' మూవీ 2026, మార్చి 26న రిలీజ్ కానుంది. దీంతో నెటిజన్లు నాని 'గురువారం' సెంటిమెంట్ ఫాలో అవుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది వరకూ శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో వచ్చిన 'దసరా' మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా 2023, మార్చి 30న (గురువారం) విడుదలైంది. దీని తర్వాత వచ్చిన చిత్రాలు సైతం గురువారమే రిలీజ్ అయ్యాయి. హాయ నాన్న (2023 డిసెంబర్ 7), సరిపోదా శనివారం (2024 ఆగస్ట్ 29) తర్వాత లైనప్‌లో ఉన్న మూవీ 'హిట్ 3' సైతం ఈ ఏడాది మే 1న గురువారం రిలీజ్ కానుంది. 'ది ప్యారడైజ్' మూవీ సైతం విడుదలయ్యేది గురువారమే. ఆ రోజు విడుదలైన సినిమాలన్నీ మంచి హిట్ కొట్టాయని.. ఈ సినిమా కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.
Also Read: రాజమౌళి, మహేశ్ 'SSMB29' మూవీలో మలయాళ స్టార్ - ఆ పోస్ట్‌తో ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లేనా?